AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allari Naresh : ఆ సీన్ కోసం చాలా ఇబ్బంది పడ్డా..’నాంది’మూవీ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నరేష్

అల్లరి నరేష్ ప్రస్తుతం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  బంగారు బుల్లోడు సినిమాతో పాటు నాంది అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు నరేష్

Allari Naresh : ఆ సీన్ కోసం చాలా ఇబ్బంది పడ్డా..'నాంది'మూవీ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నరేష్
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2021 | 5:37 AM

Share

Allari Naresh : అల్లరి నరేష్ ప్రస్తుతం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  బంగారు బుల్లోడు సినిమాతో పాటు నాంది అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు నరేష్. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో అల్లరి నరేష్ చాలా విభిన్నంగా కనిపించడంతో పాటు టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని చిత్రయూనిట్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నేను న్యూడ్ గా కనిపించవలసి ఉంటుందని దర్శకుడు ముందే చెప్పాడు. కథ అంతా బాగానే ఉంది గానీ ఆ ఒక్క సీన్ గురించే ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ సీన్ షూటింగ్ లో నేను న్యూడ్ గా ఒక గోడవైపుకు తిరిగి కూర్చున్నాను. విజయ్ టేక్ ఓకే చేసేవరకూ చాలా ఇబ్బందిపడిపోయాను. కానీ ఆ సీన్ సినిమాకు ఎంత అవసరం అనేది సినిమా చూస్తే అర్ధమవుతుంది. అని చెప్పుకొచ్చాడు నరేష్.ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ‘నాంది’ సినిమా అన్ని హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని రైట్స్ ను జీ సంస్థ దాదాపుగా రూ.10 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తుంది. శాటిలైట్ మరియు ఓటీటీ రైట్స్ విషయంలో నిర్మాతల నుండి పూర్తి హక్కులను జీ సంస్థ కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Krack Movie : కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘క్రాక్’.. పదిరోజులు దాటినా తగ్గని మాస్ రాజా సినిమా జోరు

Follow Us
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌