ఆసుపత్రిలో చేరిన ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ.. ఆ సినిమా షూటింగ్‏లో ఉండగానే.. అసలు కారణం ఏంటంటే ?

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ ఆసుపత్రిలో చేరిందట. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'గంగూబాయి

  • Rajitha Chanti
  • Publish Date - 9:46 pm, Tue, 19 January 21
ఆసుపత్రిలో చేరిన 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ.. ఆ సినిమా షూటింగ్‏లో ఉండగానే.. అసలు కారణం ఏంటంటే ?

బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ ఆసుపత్రిలో చేరిందట. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘గంగూబాయి కతియావాడి’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె స్వల్ప అస్వస్థతకు లోనైంది. హైపరాసిడిటీ, అలసట, వికారంతో అలియా బాధపడుతుండడంతో ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారట చిత్రయూనిట్. తాజా సమాచారం ప్రకారం జనవరి 17న ముంబైలో జరుగుతున్న చిత్రషూటింగ్‏లో పాల్గొన్న అలియా.. అస్వస్థతకు గురికావడంతో సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం అదే రోజు అలియాను డిశ్చార్జ్ చేసారు ఆసుపత్రి సిబ్బంది. ఇక అలియా నటిస్తున్న గంగూబాయి చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. ఇందులో విజయ్ రాజ్, శాంతను మహేశ్వరి, సీమా పహ్వా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Also Read:

Akhil And Monal Gajjar: మోనాల్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ‘హాట్‌గా కనిపిస్తున్నా కదూ’ అంటూ అఖిల్ వీడియో..

కొత్త ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పిన నందమూరీ హీరో.. తొలిసారి ట్రిపుల్ రోల్‏లో నటించనున్న కళ్యాణ్ రామ్ ?