Peddi Movie : పెద్ది కోసం అక్కినేని హీరో సినిమా వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. డైరెక్టర్ బుచ్చిబాబు సన, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా పెద్ది కోసం అక్కినేని హీరో సినిమా వాయిదా పడింది.

Peddi Movie : పెద్ది కోసం అక్కినేని హీరో సినిమా వాయిదా..  కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
Peddi, Lenin

Updated on: Mar 29, 2026 | 8:19 AM

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అప్పుడప్పుడు అగ్ర హీరోల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే, భారీ బడ్జెట్ సినిమాల మధ్య పోటీ ఏర్పడినప్పుడు వసూళ్లపై ప్రభావం పడకుండా ఉండేందుకు నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను మార్చుకోవడం కామన్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరెకక్కిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా కోసం అక్కినేని హీరో మూవీ విడుదల వాయిదా పడింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ లెనిన్. డైరెక్టర్ మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సె కథానాయికగా నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయాలని పాన్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ విడుదలను వాయిదా వేశారు. ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.అయితే పెద్ది కోసం లెనిన్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా న్యూరిలీజ్ డేట్ ను వెల్లడించింది.

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..

“మే1న విడుదల కావాల్సిన లెనిన్ చిత్రాన్ని ఇప్పుడు వాయిదా వేస్తున్నాం. మన ప్రియమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. సానుకూల ఆరోగ్యకరమైన వాతావరణంలో మనమందరం ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకుందాం. రామ్ గారికి, అఖిల్ గారికి మధ్య ఉన్న బంధం గురించి .. ఆయన ఎప్పుడూ అఖిల్ కు శ్రేయోభిలాషిగా ఉన్నారన్న సంగతి మనకు తెలిసిందే. అందుకే ఎంతో గౌరవప్రదంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం” అంటూ వెల్లడించింది చిత్రయూనిట్. అలాగే లెనిన్ సినిమాను జూన్ 26న విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Follow Us