Actress Laya: డీజే టిల్లు సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన లయ.. నెట్టింట్లో వీడియో వైరల్..

| Edited By: Ravi Kiran

Apr 18, 2022 | 9:48 AM

Actress Laya: 'పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా’ అని అన్నట్లే స్వయం వరం సినిమాలో ఎంతో అందంగా కనిపించింది లయ (Laya) . అభినయ పరంగానూ మంచి మార్కులు కొట్టేసిందీ అందాల తార.

Actress Laya: డీజే టిల్లు సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన లయ.. నెట్టింట్లో వీడియో వైరల్..
Actress Laya
Follow us on

Actress Laya: ‘పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా’ అని అన్నట్లే స్వయం వరం సినిమాలో ఎంతో అందంగా కనిపించింది లయ (Laya) . అభినయ పరంగానూ మంచి మార్కులు కొట్టేసిందీ అందాల తార. తెలుగులో టాప్‌ హీరోలతోనూ కలిసి నటించింది. ముఖ్యంగా ప్రేమించు సినిమాలో అంధురాలిగా అద్భుతంగా నటించి నంది పురస్కారంతో పాటు ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే సినిమాల్లో ఎంతో క్రేజ్‌ ఉండగానే ఎన్నారైతో పెళ్లిపీటలెక్కింది లయ. ఆతర్వాత కాలిఫోర్నియాలో సెటిలైంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.అయితే సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌ లో ఉంటుందీ ముద్దుగుమ్మ . తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటుంది. అదేవిధంగా నచ్చిన పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పంచుకుంటోంది.

ఇటీవల శ్రీరామనవమి రోజున సర్కారు వారి పాటలోని కళావతి సాంగ్‌కు కాలు కదిపి ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది లయ. దీనికి అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన డీజే టిల్లు సినిమాలోని టైటిల్‌ సాంగ్‌కు అదిరిపోయే మాస్‌ స్టెప్పులేసిందీ అందాల తార. తన స్నేహితురాలితో కలిసి చేసిన ఈ పాట ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2010లో విడుదలైన ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ అనే సినిమాలో చివరిసారిగా కనిపించింది లయ. ఆతర్వాత మళ్లీ మూడేళ్ల క్రితం రవితేజ నటించిన ‘ అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో ఓ చిన్నపాత్రలో నటించింది. కాగా ఇదే సినిమాలో ఇలియానా చిన్నప్పటి క్యారెక్టర్‌లో లయ కూతురు శ్లోకా నటించి మెప్పించడం విశేషం.

Also Read: IPL 2022: ఉత్కంఠ పోరులో గుజరాత్‌ను వరించిన విజయం.. ఒంటి చేతితో మ్యాచ్‌ను గెలిపించిన డెవిడ్‌ మిల్లర్..

Godavari Biorefineries IPO: రూ. 700 కోట్ల ఐపీవో లాంచ్ చేయనున్న కెమికల్స్ కంపెనీ.. ఇప్పటికే సెబీ నుంచి అనుమతి..

ICICI Insurance: బంపర్ రిజల్ట్స్ ప్రకటించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ కంపెనీ.. లాభం రెండితలు..