Viral Photo: రిలాక్స్‌ మోడ్‌లో ఉన్న ఈ మాజీ మిస్‌ ఇండియా ఎవరో గుర్తుపట్టారా.? ఈమె మీకు బాగా తెలిసిన వ్యక్తే..

|

Jun 02, 2022 | 9:53 PM

Viral Photo: సోషల్‌ మీడియా (Social Media) విస్తృతి పెరిగినప్పటి నుంచి సినీ తారలు యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తున్నారు. ఒకప్పుడు మీడియా ద్వారా మాత్రమే అభిమానులకు చేరువైన వారు ఇప్పుడు ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. షాపింగ్‌కు వెళ్లినా, ట్రిప్‌కు వెళ్లినా...

Viral Photo: రిలాక్స్‌ మోడ్‌లో ఉన్న ఈ మాజీ మిస్‌ ఇండియా ఎవరో గుర్తుపట్టారా.? ఈమె మీకు బాగా తెలిసిన వ్యక్తే..
Follow us on

Viral Photo: సోషల్‌ మీడియా (Social Media) విస్తృతి పెరిగినప్పటి నుంచి సినీ తారలు యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తున్నారు. ఒకప్పుడు మీడియా ద్వారా మాత్రమే అభిమానులకు చేరువైన వారు ఇప్పుడు ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. షాపింగ్‌కు వెళ్లినా, ట్రిప్‌కు వెళ్లినా వెంటనే ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇలా రోజుకో సెలబ్రిటీ నెట్టింట సందడి చేస్తున్న తాలూకు ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ అందాల తార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

పైన ఫొటోలో స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్న ఈ టాప్‌ సెలబ్రిటీ ఎవరో గుర్తుపట్టారా.? హార్స్‌ రైడింగ్‌ శిక్షణలో ఉన్న తమ చిన్నారుల కోసం ఎదురు చూస్తూ ఫొటోకు పోజిచ్చిన ఈ సూపర్‌ మామ్‌కు సోషల్‌ మీడియాలో చాలా క్రేజ్‌. ఈమె ఒక మాజీ మిస్‌ ఇండియా, అంతే కాదు టాలీవుడ్‌కు చెందిన ఓ బడా స్టార్‌ హీరో భార్య కూడా. తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఓవైపు భర్త వ్యవహారాలను చూస్తూనే మరోవైపు పిల్లల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఇంతకీ ఈ స్టార్‌ మామ్‌ ఎవరో గుర్తుపట్టారా.? మరెవరో కాదు టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌.

ఇవి కూడా చదవండి

భర్త మహేశ్‌ సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా గడిపేవారిలో నమ్రతా ఒకరు. సోషల్‌ మీడియాను సక్రమంగా ఉపయోగించుకుంటూ వ్యక్తిగత జీవితాలతో పాటు, భర్త మహేష్‌ సినిమాల విజయంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్న నమ్రతా పోస్ట్‌ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నమ్రతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పోస్ట్‌ ఆధారంగా ఆమె ఒక హార్స్‌ రైడింగ్ సెంటర్‌ వద్ద ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. వేసవి సెలవులు కావడంతో చిన్నారులకు హార్స్‌ రైడింగ్ నేర్పిస్తూ వారిని కూడా బిజీగా మార్చేస్తున్నారు నమ్రతా.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..