2017లో మలయాళ ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార ఐశ్వర్య లక్ష్మీ. కెరీర్ తొలినాళ్ల నుంచి నటకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ చిన్నది. అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుందీ చిన్నది. ఇక 2019లో విశాల్‌కి జంటగా నటించిన చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ.
ఇక తర్వాత విష్ణు విశాల్ హీరోగా వచ్చి గట్టా కుస్తీ చిత్రంతో తొలి కమర్షియల్ విజయాన్ని అందుకుందీ బ్యూటీ. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఐశ్వర్య బిజీ హీరోయిన్గా మారింది. వరుస అవకాశాలు క్యూ కట్టాయి. మరీ ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో పూంగుళి అనే పాత్రలో నటించిన ఐశ్వర్య, తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. కేవలం నటనే కాకుండా అందంతోనూ ఆకట్టుకుందీ చిన్నది.
ఇదిలా ఉంటే ఈ అందాల తార ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా మారింది. నిత్యం గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడిన ఐశ్వర్య.. ఇప్పుడున్న సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ప్రస్తుతం హీరోయిన్ల గ్లామర్ ట్రెండ్ నడుస్తోంది. హీరోయిన్స్ సినీ రంగంలో నిలదొక్కుకోవాలంటే ట్యాలెంట్‌తో పాటు, గ్లామర్ కూడా మొదటి ప్రయారిటీగా మారిందని చెప్పుకొచ్చింది.
ఇక తన కెరీర్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది ఐశ్వర్య. మొదట తనకు నటనపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ డాక్టర్ కావాలనుకొని మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంపై దృష్టిసారించినట్లు తెలిపింది. అలా కొన్ని యాడ్స్‌లో నటించడం ద్వారా సినిమా అవకాశాలు వచ్చినట్లు చెప్పుకొచ్చింది. మొత్తం మీద సోషల్ మీడియాలో ఫొటోలతోనే కాకుండా తన స్టేట్మెంట్స్తోనూ హీటెక్కిస్తోందీ బ్యూటీ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..