Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

టాలీవుడ్ సినీ చరిత్రలో కొన్ని పాటలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా, సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఓ స్టార్ హీరోయిన్ చేసిన ఒక్క స్పెషల్ సాంగ్ అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించడమే కాకుండా, ఏకంగా 365 రోజుల పాటు థియేటర్లను షేక్ చేసింది. ఒకే ఒక్క పాట కోసం ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు క్యూ కట్టిన ఆ ఆసక్తికరమైన సినీ విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..
Chinuku Chinuku Andelatho

Updated on: Nov 19, 2026 | 9:48 PM

తెలుగు సినిమా చరిత్రలో తన ప్రత్యేకమైన హాస్యంతో, విలక్షణమైన నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటుడు బాబూ మోహన్, దివంగత నటి సౌందర్యను చిత్రసీమకు పరిచయం చేసిన ఆసక్తికరమైన సంఘటనలను, అలాగే మాయలోడు సినిమాలోని “చినుకు చినుకు అందెలతో” పాట అఖండ విజయాన్ని తాజాగా పంచుకున్నారు. కోడి రామకృష్ణ, శ్యామ్ బాబు వంటి ప్రముఖ దర్శకులు, నిర్మాతలు అమ్మోరు సినిమా కోసం ఒక కొత్త ముఖం కోసం తీవ్రంగా అన్వేషిస్తున్న రోజులవి. దాదాపు మూడు నాలుగు నెలలు శ్రమించినా సరైన అమ్మాయి దొరకలేదని, ఏకంగా తొంభైకి పైగా పాఠశాలలు, కళాశాలల్లో చూసినట్లు బాబూ మోహన్ గుర్తుచేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో, బాబూ మోహన్ మనవరాలి పెళ్ళి సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నప్పుడు, సౌందర్యను చూశారు. సౌందర్యను చూడగానే, అమ్మోరు సినిమాకు కోడి రామకృష్ణ, శ్యామ్ బాబు అన్వేషిస్తున్న అమ్మాయి ఈమే అని ఆయనకు తట్టిందని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna : తొలి సినిమాకే రికార్డు.. 1965లో సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే..

వెంటనే, అప్పటికే సినీ పరిశ్రమలో మంచి పేరున్న బాబూ మోహన్, స్టిల్ ఫోటోగ్రాఫర్‌ను పిలిచి సౌందర్యకు రెండు మూడు స్టిల్స్ తీయించారు. ఆ రోజే మధ్యాహ్నం తిరుపతి నుండి మద్రాసు వెళ్లే రైలు ఉండటంతో, షూటింగ్ పూర్తి కాగానే సాయంత్రం ఆరు గంటలకు నేరుగా రైలు ఎక్కి మద్రాసు చేరుకున్నారు. శ్యామ్ బాబు ఇంట్లో లేకపోవడంతో, ఆయన ఇంటి వద్ద ఆ ఫొటోలను ఇచ్చి వచ్చారు. ఈ చొరవ వెనుక కృతజ్ఞతా భావం ఉందని బాబూ మోహన్ పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం, బాబూ మోహన్ తిరుపతిలో షూటింగ్‌లో ఉండగా, కోడి రామకృష్ణ, శ్యామ్ బాబు అకస్మాత్తుగా అక్కడకు వచ్చారు. సౌందర్య ఫొటోలు చూశామని, అమ్మోరు సినిమాకు ఆమె ఓకే అని చెప్పి వెళ్లిపోయారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : నా భార్య ఎప్పుడూ నా పక్కన నడవదు.. కారణం చెప్పిన జగపతి బాబు..

ఈ సంఘటన సౌందర్య సినీ ప్రస్థానానికి బాటలు వేసింది. ఆ తర్వాత, మాయలోడు సినిమాలోని “చినుకు చినుకు అందెలతో” పాట ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ పాట సాధించిన విజయం గురించి బాబూ మోహన్ మాట్లాడుతూ, ఒక కమెడియన్ మీద చిత్రీకరించిన ఈ పాట, హైదరాబాద్‌లోని వెంకటేశా, శ్రీనివాస థియేటర్లలో మాయలోడు సినిమాను 365 రోజులు, అంటే సంవత్సరం పాటు, సెకండ్ షోకు కూడా హౌస్‌ఫుల్ చేసేలా చేసిందని తెలిపారు. “సినిమా చరిత్రలో ఒక పాటతో సినిమా 365వ రోజు హౌస్‌ఫుల్ ఆడిన సినిమా ఎక్కడైనా ఉందా? ఇది అసాధ్యం, ఇప్పుడు దాకా లేదు, ఇకముందు కూడా అసాధ్యం” అని ఆయన తెలిపారు. ఈ పాట విజయం పట్ల సౌందర్య, ఆమె తండ్రి, సోదరుడు తన పట్ల అపరిమితమైన కృతజ్ఞతను చూపారని బాబూ మోహన్ తెలిపారు. “బాబూ మోహన్ గారి లాంటి మంచి మనిషితో మా చెల్లి యాక్ట్ చేయటం మా అదృష్టం” అని ఆమె సోదరుడు అన్నట్లు గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవల ఆధారంగా వచ్చిన సినిమా.. శోభన్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన మూవీ..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

 

Loading...
Unable to load recommendations.
Follow Us