Naga Chaitanya: నయనతారను ఫాలో అవుతోన్న చైతన్య-శోభితా జంట.? ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

|

Nov 25, 2024 | 3:29 PM

అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగేందుకు సమయం ఆసన్నమవుతోంది. నాగచైతన్య, శోభితలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతోన్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ 4వ తేదీన హైదరాబాద్‌లో వీరి వివాహం జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వీరి వివాహానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది..

Naga Chaitanya: నయనతారను ఫాలో అవుతోన్న చైతన్య-శోభితా జంట.? ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌
Naga Chaitanya Sobhita
Follow us on

నాగచైతన్య-శోభితా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట వివాహం డిసెంబర్‌ 4వ తేదీన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లిని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వీరి వివాహ వేడుకకకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

పెళ్లికి సంబంధించి ఈ కపుల్‌ నయనతార-విఘ్నేష్‌లను ఫాలో కానున్నారని వార్తలు వస్తున్నాయి. నయన్‌-విఘ్నేష్‌ల పెళ్లి డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోన్న విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య-శోభితాలు కూడా ఇదే దారిలో వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి వేడుకను డాక్యుమెంటరీగా రూపొందించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ డాక్యుమెంటరీలో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య, శోభితల సినిమా కెరీర్‌కు సంబంధించిన వివరాలతో పాటు నాగ చైతన్య వ్యక్తిగత జీవితంలో ఎదురైన సంఘటనలను డాక్యుమెంటరీలో ప్రస్తావించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్ట్రీమింగ్ హక్కుల కోసం ఇప్పటికే పలు బడా ఓటీటీ సంస్థలు అప్రోచ్‌ అవుతున్నట్లు కూడా సమాచారం.

శోభితతో నాగచైతన్య పరిచయం, ప్రేమ, పెళ్లికి దారి తీసిన అంశాలను డాక్యుమెంటరీలో పొందుపరిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రటకన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే తమ వివాహం ఆర్భాటాలకు దూరంగా ఉండనున్నట్లు చైతన్య ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్‌లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం వద్ద పెళ్లి జరగనుందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..