Uttar Pradesh Elections 2022: బాబాయ్‌-అబ్బాయ్‌ మధ్య కుదిరిన డీల్‌.. యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం..

| Edited By: Anil kumar poka

Dec 23, 2021 | 6:13 PM

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అబ్బాయి-బాబాయి మధ్య పొత్తు కుదిరింది. ఎన్నికల వేళ ఏకమయ్యారు అఖిలేశ్‌-శివపాల్‌యాదవ్‌. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఇద్దరు ప్రకటించారు.

Uttar Pradesh Elections 2022: బాబాయ్‌-అబ్బాయ్‌ మధ్య కుదిరిన డీల్‌.. యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం..
Akhilesh Yadav On Meeting W
Follow us on

Akhilesh Yadav on Meeting with Shivpal Yadav: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అబ్బాయి-బాబాయి మధ్య పొత్తు కుదిరింది. ఎన్నికల వేళ ఏకమయ్యారు అఖిలేశ్‌-శివపాల్‌యాదవ్‌. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఇద్దరు ప్రకటించారు. పొత్తు కుదిరిందని , రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌. 2017లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి బయటకు వెళ్లిన శివపాల్‌ యాదవ్‌ ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీని ప్రారంభించారు. అయితే తన పార్టీని సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేస్తారా ? లేక పొత్తు మాత్రమే ఉంటుందా అన్న విషయంపై సస్పెన్స్‌ నెలకొంది.

అయితే తాజా భేటీతో ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తొలగిపోయాయని సమాజ్‌వాదీ పార్టీ నేతలు చెబుతున్నారు . లక్నోలో శివపాల్‌యాదవ్‌ ఇంటికి వెళ్లిన అఖిలేశ్‌ 45 నిముషాల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ముందుగా పార్టీతో పొత్తు పెట్టుకోవాలా..? లేదా పార్టీని విలీనం చేయాలా అనే అంశంపై చర్చించారు. శివపాల్ తమ పార్టీకి 25 నుంచి 40 సీట్లు కావాలని కోరారు. అఖిలేష్‌కు ఈక్వేషన్‌తో సహా ఆ సీట్ల గురించి శివపాల్ సమాచారం అందించారు. అదే సమయంలో విలీన పక్షంలో శివపాల్‌కు రాష్ట్ర స్థాయిలో లేదా జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్థానం కల్పించాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

చిన్న పార్టీలపై ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. వెనుకబడిన కులాల పార్టీలతో కూడిన మహాకూటమిని ఏర్పాటు చేసి బీజేపీకి సవాల్ విసిరాలని అఖిలేష్ భావిస్తున్నారు. అఖిలేష్ ఇప్పటివరకు జయంత్ చౌదరి RLD, ఓంప్రకాష్ రాజ్‌భర్ సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, కేశవ్ దేవ్ మౌర్య మహాన్ దళ్, సంజయ్ చౌహాన్ పీపుల్స్ పార్టీ S, గోండ్వానా గంతంత్ర పార్టీ అప్నాదళ్ కెమెరావాడీలతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు బాబాయితో పొత్తు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి: బెజవాడలో ఘరానా చోరీ.. షార్ట్ ఫిల్మ్ చేయాలని పిలిచి కెమెరామెన్‌కు కుచ్చుటోపీ.. కెమెరాలతో ఉడాయించిన దొంగలు.

Chandrababu: తిరుచానూరులో అమరావతి రైతులు సభ.. హాజరుకానున్న చంద్రబాబు..