ఏపీ స‌ర్కార్ అదిరిపోయే గిఫ్ట్స్‌… క‌రోనా టెస్ట్‌లు చేయించుకున్న వారికి మాత్ర‌మే

ఏపీలో క‌రోనా జ‌డ‌లు విప్పుకుంటోంది. వైరస్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా వాలంటీర్ల సాయంతో ...

ఏపీ స‌ర్కార్ అదిరిపోయే గిఫ్ట్స్‌... క‌రోనా టెస్ట్‌లు చేయించుకున్న వారికి మాత్ర‌మే
Follow us

|

Updated on: Apr 12, 2020 | 1:04 PM

ఏపీలో క‌రోనా జ‌డ‌లు విప్పుకుంటోంది.  వైరస్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా వాలంటీర్ల సాయంతో ఇంటిటి స‌ర్వే నిర్వ‌హిస్తూ.. వైర‌స్ అనుమానితుల‌ను గుర్తించేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ ఓ వినూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. వివ‌రాల్లోకి వెళితే…

కరోనా వైరస్ (కోవిడ్‌–19) వ్యాప్తిని అరికట్టేందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి కొత్త ఆలోచ‌న చేశారు. పొడి దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకుంటే ఆకర్షణీయమైన గిఫ్ట్‌తో పాటు నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. ఈ లక్షణాలున్నవారు స్థానికంగా ఉండే వైద్య సిబ్బందికి సమాచారం ఇస్తే అధికారులే ఇంటి వద్దకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా కరోనా పాజిటివ్‌ అని తేలితే వారి పేరు గోప్యంగా ఉంచి మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు.

ఇందులో భాగంగా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి క‌రోనా పరీక్షలు చేయించుకున్న వారిలో ప్రతి వారం ఐదుగురు చొప్పున లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేసి మిక్సీ, గ్రైండర్, గ్యాస్‌ స్టౌ, కుక్కర్‌ తదితర బహుమతులతో పాటు ఒక్కొక్కరికి రూ. 5,500 నగదు బహుమతి అందజేస్తామని వివరించారు. ఈ వారం రోజుల్లో వైద్య పరీక్షలకు ముందుకు వచ్చిన వారిలో లక్కీడిప్‌ ద్వారా ఎంపికైన ఐదుగురు విజేతలకు శనివారం కలెక్టరేట్‌లో బహుమతులు అందజేశారు. కాగా, తూర్పు గోదావరి జిల్లాల్లో శనివారం రాత్రి వరకు 17 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు డిశ్చార్జ్ అయ్యారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు