కేసుల పెరుగుదల టెస్టింగులను పెంచడం వల్లే ! అరవింద్ కేజ్రీవాల్

టెస్టింగులను పెంచడంవల్లే ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరిగాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా రోగులను గుర్తించేందుకు టెస్టింగుల ప్రక్రియను చేపట్టవలసి వచ్చిందన్నారు.

కేసుల పెరుగుదల టెస్టింగులను పెంచడం వల్లే ! అరవింద్ కేజ్రీవాల్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 05, 2020 | 1:11 PM

టెస్టింగులను పెంచడంవల్లే ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరిగాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా రోగులను గుర్తించేందుకు టెస్టింగుల ప్రక్రియను చేపట్టవలసి వచ్చిందన్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను ఖఛ్చితంగా పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటింపు అన్నది కూడా ముఖ్యమేనని ఆయన చెప్పారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన  చెందడం లేదు.. కానీ మృతుల సంఖ్య పెరిగితేనే అది చాలా విచారకరం అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. టెస్టింగులను 20 వేల నుంచి 40 వేలకు పెంచిన ఫలితమే ఈ కేసుల పెరుగుదలకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమైతేనేం ? నగరంలో పరిస్థితి అదుపులోనే ఉంది అని చెప్పి తృప్తి పడ్డారు.