Crime News: దారుణం.. భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్.. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అడ్డుకుని..

|

Aug 12, 2021 | 1:42 PM

Rajasthan Barmer Crime News: భర్త కళ్లదుటే ఓ వివాహితపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుష సంఘటన

Crime News: దారుణం.. భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్.. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అడ్డుకుని..
Woman gang-rape
Follow us on

Rajasthan Barmer Crime News: భర్త కళ్లెదుటే ఓ వివాహితపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుష సంఘటన రాజస్థాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. దంపతులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఓ టోల్ ప్లాజా వద్ద కారులో వచ్చిన నలుగురు యువకులు వారిని అడ్డగించారు. అనంతరం భర్తను తీవ్రంతగా కొట్టి భార్యపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. సింధారీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్మేర్‌ జిల్లాకు చెందిన దంపతులు.. మంగళవారం సాయంత్రం బలోత్రాకు బైక్‌పై బయలుదేరారు.

ఈ దంపతులను మార్గమధ్యంలో నలుగురు దుండగులు అడ్డగించి వాహనం లాగేసుకున్నారు. బైక్‌ను ఓ యువకుడు తీసుకుని అక్కడ నుంచి ఉడాయించాడు. అనంతరం మిగతా ముగ్గురు ఆమె భర్తను తీవ్రంగా కొట్టారు. భార్యాభర్తలిద్దరిని బలవంతంగా కారులోకి ఎక్కించారు. అనంతరం కదులుతున్న వాహనంలోనే ముగ్గురూ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాధితులను సర్నూ టోల్ ప్లాజ్‌కు సమీపంలో వదిలేశారు. నిస్సహాయ స్థితిలో పడి ఉన్న భార్యభర్తలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని.. వారి ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు నిందితులు కమ్తాయ్ జాట్, బాబులాల్ జాట్, నరేష్‌ జాట్ లను అరెస్టు చేసినట్లు బార్మర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆనంద్ శర్మ వెల్లడించారు. ముగ్గురూ కంథాయ్‌కు చెందినవారపి తులిసానేజ బైక్ తీసుకుని పరారైన నాలుగో నిందితుడు కిషన్ కోసం గాలిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరికీ చికిత్స కొనసాగుతుందని.. కోలకున్నారని పేర్కొన్నారు. బాధితురాలికి సైతం వైద్య పరీక్షలు పూర్తిచేసినట్టు ఎస్పీ వివరించారు.

Also Read:

AP Crime: కన్నతల్లి కర్కశత్వం.. 14 రోజుల శిశువును దారుణంగా చంపిన తల్లి.. వాటర్ ట్యాంకులో పడేసి..

Kidnap And Murder Case: రియల్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ప్రముఖ బాబా అరెస్ట్..