బెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో శనివారం తృణమూల్ కాంగ్రెస్ యువజన నేత రణజాయ్ కుమార్ శ్రీవాస్తవ (33) ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ కేసులో పోలీసులు అయిదుగురిని అరెస్టు చేశారు. ఈ దాడికి బీజేపీ కారణమని తృణమూల్ నేతలు ఆరోపిస్తుండగా.. ఆ పార్టీ వారు తమలో తాము దాడులు చేసుకోవడం సహజమైందని., వాటిని తమపై రుద్దుతున్నారని బీజేపీ ఖండిస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో ఖర్దా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన కాజల్ సిన్హాకు శ్రీవాత్సవ సన్నిహితుడు.(అయితే కోవిడ్ తో కాజల్ సిన్హా మరణించారు). శ్రీవాస్తవ ఈ ఉదయం తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు ఆయన కారును ఆపారు. ఆయన ఆపగానే వారు ఆయనపై బాంబులు విసిరి.. కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించే లోగా మరణించాడు. ఈ దాడికి బీజేపీ బాధ్యత వహించాలని ఉత్తర 24 పరగణాల జిల్లా తృణమూల్ చీఫ్ జ్యోతిప్రియో మల్లిక్ ఆరోపించారు. జిల్లాలో తమ పార్టీని బీజేపీ టార్గెట్ చేసిందన్నారు.
అసెంబ్లీలో తృణమూల్ చీఫ్ విప్ నిర్మల్ ఘోష్ కూడా ఇదే ఆరోపణ చేశారు. జిల్లాలో టీఎంసి నేతల ఎదుగుదల చూసి కమలం పార్టీ బెదిరిపోతోందన్నారు. అయితే బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ దీన్ని ఖండిస్తూ.. నిజానికి నిర్మల్ ఘోష్ సహచరులే ఈ దాడికి కారకులని,, వారు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలని అన్నారు. మాపై బురద చల్లవద్దని ఆయన హెచ్చరించారు. డబ్బుల వసూళ్ల విషయంలో తృణమూల్ కాంగ్రెస్ వర్గీయులు తమలో తాము గొడవ పడుతుంటారని ఆయన చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి : బాయ్‌ఫ్రెండ్ కోసం..జుట్లు పీక్కుని కొట్టుకున్న అమ్మాయిలు..!ట్రెండ్ అవుతున్న వీడియో: Girls Hit For a Boyfriend Video.
జోకర్ దొంగ..పోలీసులకే ఛాలెంజ్..!హాలీవుడ్ తరహాలో ఏటీఏం చోరీ వైరల్ వీడియో..:Joker Thief Video.