Khammam Murder: ఇంజక్షన్‌తో వ్యక్తిని చంపిన కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో ఇద్దరు.. ఒకరు పరార్‌..!

|

Sep 20, 2022 | 10:37 PM

Khammam Murder: ఖమ్మం జిల్లాలో ఇంజక్షన్‌తో జామాల్‌ సాహెబ్‌ అనే వ్యక్తిని చంపిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వివాహేతర సంబంధమే హత్యక కారణమని..

Khammam Murder: ఇంజక్షన్‌తో వ్యక్తిని చంపిన కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో ఇద్దరు.. ఒకరు పరార్‌..!
Khammam Murder
Follow us on

Khammam Murder: ఖమ్మం జిల్లాలో ఇంజక్షన్‌తో జామాల్‌ సాహెబ్‌ అనే వ్యక్తిని చంపిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వివాహేతర సంబంధమే హత్యక కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే హత్యలో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. నిందితులు చింతకాని మండలానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. జమాల్‌ సాహెబ్‌ (55)ను చంపేందుకు వీరు పక్కా ప్రణాళిక రచించినట్లు నిర్ధారించారు పోలీసులు. హత్యలో ఇద్దరు డ్రైవర్లు, ఆర్‌ఎంపీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉండగా, ఆయన కోసం పో లీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

అయితే సినిమాల్లో జరిగినట్లుగా జమాల్‌ హత్య జరగడం అందరిని ఆందోళనకు గురి చేసింది. బైక్‌ లిఫ్ట్‌ అడిగిన వ్యక్తిని పోనిలే అని లిఫ్ట్‌ ఇవ్వడమే జామాల్‌ సాహెబ్‌కు శాపంగా మారింది. బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చి ప్రాణాలు కోల్పోయాడు. షేక్‌ జమాల్‌ సాహెబ్‌ది ముదిగొండ మండలంలోని బొప్పాపురం. ఆయన కుమార్తె ఏపీలోని గండ్రాయి గ్రామంలో నివసిస్తోంది. అయితే కుమార్తెను చూసేందుకు జమాల్‌ బైక్‌పై వల్లభి మీదుగా గండ్రాయి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో జమాల్‌ను గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్‌ అడిగాడు. అప్పటికే ఆయన మంకీ క్యాప్‌ ధరించి ఉండగా, జమాల్‌కు పెద్దగా అనుమానం రాలేదు. బైక్‌ బాణాపురం గ్రామం దాటిన తర్వాత వల్లభి దగ్గర జమాల్‌కు వెనుక నుంచి ఇంజక్షన్‌ ఇచ్చాడు. ఏదో గుచ్చుకుందని బైక్‌ ఆపాడు జమాల్‌. ఇదే అదనుగా భావించిన సదరు వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. జామల్‌ జరిగిన విషయాన్ని భార్యకు ఫోన్‌లో తెలుపుతూ స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆయనను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటన స్థలంలో ఇంజెక్షన్‌, సిరంజిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఇద్దరిని అరెస్టు చేయగా, ఒకరు పారారీలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి