AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెంటిలేటరుపై చికిత్స పొందుతున్న యువతిపై అఘాయిత్యం

ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న మహిళా రోగిపై వైద్య సిబ్బంది అత్యాచారానికి ఒడిగట్టాడు. వెంటీలేట‌ర్‌పై స్పృహ‌లో లేని స‌మ‌యంలో కామాంధుడు త‌న ‌వాంఛ తీర్చుకున్న దారుణ ఘటన ఢిల్లీ శివార్ల‌లోని గురుగ్రామ్‌లో వెలుగులోకి వ‌చ్చింది.

వెంటిలేటరుపై చికిత్స పొందుతున్న యువతిపై అఘాయిత్యం
Balaraju Goud
|

Updated on: Oct 29, 2020 | 8:45 AM

Share

ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న మహిళా రోగిపై వైద్య సిబ్బంది అత్యాచారానికి ఒడిగట్టాడు. వెంటీలేట‌ర్‌పై స్పృహ‌లో లేని స‌మ‌యంలో కామాంధుడు త‌న ‌వాంఛ తీర్చుకున్న దారుణ ఘటన ఢిల్లీ శివార్ల‌లోని గురుగ్రామ్‌లో వెలుగులోకి వ‌చ్చింది. గురుగ్రామ్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స కోసం చేరింది. తాను వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపింది. ఈ ఘటన ఈ నెల 21 నుంచి 27 వతేదీ మధ్య జరిగిందని, స్పృహలోకి వచ్చాక బాధిత యువతి సంఘటన గురించి చెప్పిందని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. బాధిత యువతి ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మహేంద్రనగర్ ప్రాంతానికి చెందిన యువతి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ క్షయవ్యాధికి చికిత్స పొందేందుకు ఐసీయూలోని ఓ ప్రైవేటు గదిలో చేరిందని పోలీసులు చెప్పారు.రోగిని కలిసేందుకు వచ్చిన తండ్రికి బాధిత యువతి రాతపూర్వకంగా తెలిపిందని ఏసీపీ ఉషా కుండు చెప్పారు. ఈ ఘటనపై సుశాంత్ లోక్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 376(2)ఇ కింద కేసు నమోదు చేసి, నిందితుడిని గుర్తించామని ఏసీపీ చెప్పారు. ఈ కేసులో ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వికాస్ అని, తాము ఆసుపత్రి ఉద్యోగులను ప్రశ్నిస్తున్నామని ఏసీపీ వివరించారు. మరోవైపు, ఈ కేసులో పోలీసులకు తాము సహకరిస్తామని ఫోర్టిస్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అటు ఈ ఆకృత్యానికి మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తన్నాయి.

Follow Us
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?
బాల్యానికి పుస్తెల బంధం.. పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!
బాల్యానికి పుస్తెల బంధం.. పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి..
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి..
NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్
NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్
రోహిత్, కోహ్లీ కాదు.. వన్డే వరల్డ్ కప్‌లో ఆ ఇద్దరు లేకుంటే బూడిదే
రోహిత్, కోహ్లీ కాదు.. వన్డే వరల్డ్ కప్‌లో ఆ ఇద్దరు లేకుంటే బూడిదే
గురు పౌర్ణమి నాడు అరుదైన 3 మహా యోగాలు.. ఈ శుభ సమయాన్ని అస్సలు..
గురు పౌర్ణమి నాడు అరుదైన 3 మహా యోగాలు.. ఈ శుభ సమయాన్ని అస్సలు..