Crime News: హైదరాబాద్‌లో అమానుషం.. చెత్తకుండీలో శిశువు మృతదేహం.. రంగంలోకి పోలీసులు..

Newborn baby's body found in garbage: అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తలో పడేశారు. ఈ అమానుష సంఘటన హైద‌రాబాద్ న‌గ‌రంలోని

Crime News: హైదరాబాద్‌లో అమానుషం.. చెత్తకుండీలో శిశువు మృతదేహం.. రంగంలోకి పోలీసులు..
Baby

Updated on: Oct 23, 2021 | 10:54 AM

Newborn baby’s body found in garbage: అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తలో పడేశారు. ఈ అమానుష సంఘటన హైద‌రాబాద్ న‌గ‌రంలోని అంబ‌ర్‌పేట‌లో చోటు చేసుకుంది. అంబ‌ర్‌పేట పోలీసు స్టేష‌న్‌కు స‌మీపంలో ఉన్న చెత్త కుండీలో అప్పుడే పుట్టిన శిశువును క‌వ‌ర్‌లో చుట్టి వ‌దిలేసి వెళ్లి పోయారు. అయితే.. చెత్త తీసేందుకు వెళ్లిన పారిశుద్ధ్య కార్మికులు శనివారం ఉద‌యం చెత్త కుండీ దగ్గరకు వెళ్లగా శిశువు మృత‌దేహం క‌నిపించింది. దీంతో పారిశుధ్య కార్మికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

సమాచారం అనంతరం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వివరాలు సేకరించారు. శిశువు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆసుపత్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నట్లు అంబర్ పేట పోలీసులు తెలిపారు. కాగా.. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది.

Also Read:

Trekkers: పర్వతారోహణకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. తప్పిపోయిన ట్రెక్కర్లు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ..

JP Nadda: ఆ ఘనత మనకే సొంతం.. 100 కోట్ల వ్యాక్సినేషన్‌పై జేపీ నడ్డా కీలక వ్యాసం..

Petrol Diesel Prices Today: బాదుడే.. బాదుడే.. మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. సామాన్యుడి జేబుకు చిల్లు..!