దారుణంః అక్కపైనే కన్నేసిన తమ్ముడు..వీడిని ఏం చేయాలి..
కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వావివరుసలు మర్చిపోయిన ఓ కామాంధుడు రెచ్చిపోయి మృగంలా మారాడు. అక్కపైనే కన్నేసిన కామాంధుడు..ఆమెను చెరబట్టాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది...
దారుణం: కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వావివరుసలు మర్చిపోయిన ఓ కామాంధుడు రెచ్చిపోయి మృగంలా మారాడు. అక్కపైనే కన్నేసిన కామాంధుడు..ఆమెను చెరబట్టాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే…
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగలూటి చెంచుగూడెంలో ఈ దారుణ సంఘటన జరిగింది. బాధితురాలి భర్తకు కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో స్థానిక ఆస్పత్రిలో చూపించింది. మంగళవారం మరోసారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటో కోసం బయటకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమెపై ఎప్పటినుంచో కన్నేసిన అదే గూడెంకు చెందిన ఓ యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పి ఆటో తాను చూపిస్తానని నమ్మించాడు. వరుసకు తమ్ముడే కావడంతో ఆమె అతడి మాటలు నమ్మి బయల్దేరింది. ఇదే అదునుగా దుర్మార్గుడు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం స్థానికులు చెప్పినా ఎవరూ ఆమెను మాటను లెక్కచేయలేదు. పైగా రాత్రివేళ అతడితో బైక్‌పై ఎందుకు వెళ్లావని తననే నిందించారట.
మర్నాడు భర్తతో పాటు ఆస్పత్రికి వెళ్లిన బాధితురాలి పరిస్థితి గమనించిన వైద్యులు ఆమెకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో అసలు విషయం బయటపెట్టింది బాధితురాలు. భార్యభర్తలిద్దరినీ మెరుగైన చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్నగూడెం పెద్దలు ఇరు కుటుంబాల మధ్య రాజీకుదిర్చే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, నిందితుడు గతంలోనూ ఓ మహిళపై అత్యాచారం చేసి హత్యచేశాడని, ఆ కేసులో జైలుకు కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. బాధితురాలి వాగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.