Telangana: వామ్మో.. ఇళ్లపైకి దూసుకెళ్లి లారీ బోల్తా.. ఘటనా స్థలిలో భీకర దృశ్యం

|

May 28, 2022 | 12:57 PM

ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు తరచూ సూచనలు చేస్తుంటారు. తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది.

Telangana: వామ్మో.. ఇళ్లపైకి దూసుకెళ్లి లారీ బోల్తా.. ఘటనా స్థలిలో భీకర దృశ్యం
Lorry Accident
Follow us on

Adilabad Lorry Accident: దేశంలో రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నిర్లక్ష్యం, అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా నిత్యం వందలాది మంది మరణిస్తుండగా.. పలువురు గాయపడుతున్నారు. దీంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందుకే.. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు తరచూ సూచనలు చేస్తుంటారు. కాగా.. తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది.

Adilabad Lorry Accident

జిల్లాలోని గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ వద్ద శనివారం ఉదయం ఇళ్లపైకి లారీ దూసుకెళ్లింది. ధాన్యం లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడి ఇళ్లపైకి దూసుకెళ్లింది. అయితే..ఈ క్రమంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్టారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి.

Accident

స్థానికుల నుంచి అందిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లనే లారీ బోల్తా పడినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..