AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళ ఆత్మహత్య.. ఇరకాటంలో మాజీ మంత్రి..!

ఎంత అవసరమొచ్చిందో ఏమో తెలీదు గానీ.. ఓ మాజీ మంత్రి ఓ మహిళ దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బును చెల్లించమని ఎన్నిసార్లు ఆమె అడిగినా.. ఆయన చెల్లించలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన సదరు మహిళ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని చంద్రలేఔట్ పోలీస్‌స్టేషన్‌ పరిదిలో అంజనా వి. శాంతవేరి అనే మహిళ, మాజీ మంత్రి బాబు రావ్ చించనసూర్‌కు […]

మహిళ ఆత్మహత్య.. ఇరకాటంలో మాజీ మంత్రి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 04, 2019 | 4:05 PM

Share

ఎంత అవసరమొచ్చిందో ఏమో తెలీదు గానీ.. ఓ మాజీ మంత్రి ఓ మహిళ దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బును చెల్లించమని ఎన్నిసార్లు ఆమె అడిగినా.. ఆయన చెల్లించలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన సదరు మహిళ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని చంద్రలేఔట్ పోలీస్‌స్టేషన్‌ పరిదిలో అంజనా వి. శాంతవేరి అనే మహిళ, మాజీ మంత్రి బాబు రావ్ చించనసూర్‌కు రూ.11.88కోట్లు అప్పుగా ఇచ్చారు. ఈ డబ్బును ఇతరుల దగ్గర నుంచి తీసుకొని ఆమె.. ఆయనకు ఇచ్చారు. అయితే ఆ తరువాత ఆ అప్పును అతడు చెల్లించలేదు. దీంతో ఏమీ చేయాలో పాలిపోని అంజనా.. మాజీ మంత్రిపై అంజన కేసు వేసింది. ఈ కేసు విచారణ జరుగుతుండగా.. మరోవైపు అంజనాకు అప్పుల వారి నుంచి ఒత్తిడి అధికమైంది. తమ వద్ద తీసుకున్న రుణాలను చెల్లించాలని వారు ఆమెను డిమాండ్ చేశారు. ఓ వైపు తాను ఇచ్చిన డబ్బులు రాకపోవడం, మరోవైపు ఒత్తిళ్లతో భరించలేకపోయిన ఆమె.. ఫ్యాన్‌కు ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన కుమారుడికి ఫోన్ చేసింది. ఇక ఈ ఘటనపై చంద్రలేఔట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన బాబూరావ్ స్వస్థలం కలబుర్గి జిల్లాల చించోళి. ఇటీవల ఆయన బీజేపీలో చేరారు

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా