ప్రేయసి బర్త్‌డేకు అరుదైన కానుక అందజేసిన ప్రేమికుడు.. తర్వాత పోలీసులకు అడ్డంగా బుక్.. ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలిస్తే షాక్..
ప్రియురాలు పుట్టిన రోజు వచ్చిందంటే చాలు ప్రియుడు మంచి గిఫ్ట్‌ను ప్రజెంట్ చేసి మెస్మరైజ్ చేయాలని చూస్తాడు. సాధారణంగా అందరూ చేసే పనే. అందుకోసం
ప్రియురాలు పుట్టిన రోజు వచ్చిందంటే చాలు ప్రియుడు మంచి గిఫ్ట్‌ను ప్రజెంట్ చేసి మెస్మరైజ్ చేయాలని చూస్తాడు. సాధారణంగా అందరూ చేసే పనే. అందుకోసం కొంతమంది ఖరీదైన వస్తువులు, మరికొంత మంది దుస్తులు, కేకులు, చాక్లెట్లు ఇలా వారి పరిధి బట్టి అందిస్తారు. కానీ దుబాయ్‌లో ఓ లవర్ భాయ్ ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు. ప్రేయసి కోసం ఏకంగా ఒంటె పిల్లను ఎత్తుకొచ్చి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే..
కొన్ని రోజుల క్రితం ఓ జంట తమ ఒంటె పిల్ల కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా ఈ విషయం ఆ దొంగకు తెలిసింది. దీంతో ఎక్కడి నుంచైతే ఒంటె పిల్లను ఎత్తుకొచ్చాడో అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో దానిని వదిలిపెట్టి వచ్చాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తానే దాని జాడను చెప్పాడు. కొన్ని రోజులుగా అక్కడే తచ్చాడుతుందంటూ సమాచారం అందించారు. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ప్రేమికురాలికి గిఫ్టు ఇచ్చేందుకే ఈ దొంగతనం చేశానని అతడు అంగీకరించాడు. తొలుత తల్లి ఒంటెనే తీసుకువెళ్దామని భావించానని, అయితే అప్పుడే ఓనర్లు రావడంతో దానిని వదిలేసి పిల్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో చోరీ చేయడమే కాకుండా తమను తప్పుదోవపట్టించినందుకు నిందితుడు, అతడి ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
యువ ఉద్యోగులకు శుభవార్త.. సులువుగా అతి తక్కువ వడ్డీతో సబ్సిడీ హోమ్ లోన్.. 35 లక్షల వరకు అవకాశం..