మహిళా సాఫ్ట్‌వేర్ రోహిత మిస్సింగ్ కేసులో కీలక సాక్ష్యాలు!

గచ్చిబౌలిలోని మహిళా సాఫ్ట్‌వేర్ రోహిత అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. ఆమె మిస్ అయి ఇప్పటివరకూ 13 రోజులైనా ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో.. కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రోహిత ఫోన్‌ను పోలీసులు అన్‌ లాక్ చేశారు. దాని నుంచి కీలక సమాచారం సేకరించారు. రోహిత ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేసి రెక్కీ నిర్వహిస్తున్నారు. అటు రోహిత కుటుంబ సభ్యులు కూడా.. ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నారు. హైదరాబాద్ ఆపిల్ […]

మహిళా సాఫ్ట్‌వేర్ రోహిత మిస్సింగ్ కేసులో కీలక సాక్ష్యాలు!
Follow us

| Edited By:

Updated on: Jan 07, 2020 | 6:34 PM

గచ్చిబౌలిలోని మహిళా సాఫ్ట్‌వేర్ రోహిత అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. ఆమె మిస్ అయి ఇప్పటివరకూ 13 రోజులైనా ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో.. కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రోహిత ఫోన్‌ను పోలీసులు అన్‌ లాక్ చేశారు. దాని నుంచి కీలక సమాచారం సేకరించారు. రోహిత ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేసి రెక్కీ నిర్వహిస్తున్నారు. అటు రోహిత కుటుంబ సభ్యులు కూడా.. ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

హైదరాబాద్ ఆపిల్ ఇండియా ఉద్యోగి అయిన 34 ఏళ్ల రోహిత 2019 డిసెంబర్ 26 నుంచి కనిపించకుండాపోయింది. ఆ రోజు ఈ రోజు వరకూ కనీసం చిన్న క్లూ కూడా దొరకలేదు. రోహిత తన ఇద్దరు మిత్రులతో కలిసి సెలెస్టా అపార్ట్‌మెంట్లో నివసించేది. రోహిత సోదరుడు పరీక్షిత్ మాట్లాడుతూ.. తన సోదరి ఆచూకీ కనుగొనడంలో పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఆమె తన అపార్ట్ మెంట్ ముందు ఆటోలో వెళ్లడం కనిపించింది. ఆ తరువాత ఆమె ఎక్కడికి వెళ్ళారనే దానిపై స్పష్టత లేదు. రోహిత తన ఫోన్‌ను అపార్ట్‌మెంట్‌లోనే ఉంచడంతో, ఆమె ఆచూకీని ట్రేస్ చెయ్యడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. అయితే.. ఈరోజు ఆ ఫోన్‌ను పోలీసులు అన్‌ లాక్ చేశారు. రోహిత చివరిగా ఎవరితో చాటింగ్ చేసింది. ఎవరితో కాల్‌లో మాట్లాడింది అనేదానిపై పోలీసుల విచారణ జరుపుతున్నారు.

Latest Articles
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో