జీవిత కాలం పెన్షన్ కోసం ఎల్ఐసీ నుంచి అద్భుతమైన పాలసీ

26 May 2024

TV9 Telugu

కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ).. కొత్త పెన్షన్ స్కీం ‘సరళ్ పెన్షన్’ తీసుకొచ్చింది.

ఎల్ఐసీ

పాలసీదారుడు ఒకేసారి ఎక్కువ మొత్తం ప్రీమియం చెల్లింపుతో పెన్షన్ పొందొచ్చు. ఈ పాలసీలో రెండు ఆప్షన్లు ఉన్నాయి.

మొత్తం ప్రీమియం

ఈ పెన్షన్ కింద పాలసీదారుడు జీవితాంతం పెన్షన్ పొందడంతో పాటు పాలసీదారు మరణించిన తర్వాత 100 శాతం రిటర్న్స్‌ మరో ఆప్షన్‌.

జీవితాంతం పెన్షన్ 

వ్యక్తి మరణిస్తే యాన్యుటీ చెల్లింపులు నిలిచిపోయి.. నామినీకి 100 శాతం మొత్తం చెల్లిస్తుంది ఎల్ఐసీ.

వ్యక్తి మరణిస్తే

రెండో ఆప్షన్ ప్రకారం పాలసీదారు, ఆ వ్యక్తి జీవిత భాగస్వామి జీవించి ఉన్నంత కాలం యాన్యుటీ బ్యాలెన్స్ చెల్లిస్తారు. 

జీవిత భాగస్వామి 

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ పాలసీ కొనుగోలుకు 40 ఏండ్లు కనీస వయస్సు, 80 ఏండ్లు గరిష్ట వయస్సుగా నిర్ణయించింది. 

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ 

పాలసీ ప్రారంభ సమయంలోనే ఎల్ఐసీ తన పాలసీ డాక్యుమెంట్‌తోపాటు యాన్యుటీ రేట్ల హామీ ఇస్తుంది. 

ఎల్ఐసీ

ఉదాహరణకు 60 ఏండ్ల వయస్సు గల వ్యక్తి రూ.10 లక్షల పెట్టుబడితో వార్షిక యాన్యుటీ ఆప్షన్ ఎంచుకుంటే ఏటా రూ.58,950 యాన్యుటీ వస్తుంది. 

వార్షిక యాన్యుటీ