ఫైనల్‌లో SRH పరాజయం.. కన్నీళ్లు పెట్టుకున్న కావ్యా మారన్

TV9 Telugu

26 May 2024

ఆదివారం (మే 26)న జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఘోర పరాజయం పాలైంది.

చెన్నై వేదికగా జరిగన ఈ మ్యాచ్ లో కోల్ కతా జట్టు 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ ను ఓడించి ఐపీఎల్ విజేతగా నిలిచింది.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ కోల్‌ కతా బౌలర్ల ధాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్ప కూలింది.

ఆ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 10 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్టు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

కాగా ఎన్నో ఆశలతో ఫైనల్ లోకి అడుగుపెట్టిన ఎస్ ఆర్ హెచ్ తుది మెట్టుపై బోల్తా పడడంతో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్యా పాప మ్యాచ్ ముగిసిన వెంటనే కన్నీళ్లు పెట్టుకుంది. అయినా చప్పట్లు కొట్టి ఆటగాళ్లను అభినందించింది.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు  'ధైర్యంగా ఉండండి కావ్యా మేడమ్'అంటూ కామెంట్లు పెడుతున్నారు.