సైలెంట్ అయ్యింది ప్రశాంత్ మాత్రమే.. ఆ ప్రాజెక్ట్ కాదు.

Anil Kumar

26 May 2024

తేజ సజ్జ తో హనుమాన్సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ప్రశాంత్ వర్మ కాస్త సైలెంట్ గా కనిపిస్తున్నారు.

ఆ తరువాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ తో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

నెట్టింట సినిమా ఆగిపోయింది అంటూ వస్తున్న ప్రచారం అబద్ధమని చెప్పారు మేకర్స్.. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు.

ఈ సినిమాకు గాను "రాక్షస" అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు అని తెలిపారు. అది కూడా ప్రకటిస్తామన్నారు.

అనుకున్నట్టే భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

అనుకున్నట్టే భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

తేజ సజ్జా లాంటి యంగ్ హీరోకి 300 కోట్ల సినిమా ఇచ్చిన ప్రశాంత్ కాన్ఫిడెన్స్‌కు బాలీవుడ్ హీరోలు సైతం బెండ్ అయ్యారు.