వామ్మో.. దీపికా బ్యాగ్ ధరతో అన్ని తులాల బంగారం కొనచ్చా..!
రణ్వీర్తో పెళ్లి తరువాత సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. అంతేకాదు ప్రొడ్యూసర్‌గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోంది. ఇదిలా ఉంటే ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చింది దీపికా. అప్పుడు ఆమె ఓ ట్రావెల్ బ్యాగ్‌ను వెంట తెచ్చుకుంది. బ్రౌన్, క్రీమ్ కలర్స్‌తో ఉన్న ఈ బ్యాగ్ చూడటానికి మామూలుగా ఉన్న.. ధర మాత్రం అదరగొడుతోంది. ఆ బ్యాగ్ ప్రముఖ లూయిస్ విట్టన్ బ్రాండ్‌కు చెందిన కాగా.. దాని ఖరీదు అక్షరాల […]
రణ్వీర్తో పెళ్లి తరువాత సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే. అంతేకాదు ప్రొడ్యూసర్‌గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోంది. ఇదిలా ఉంటే ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చింది దీపికా. అప్పుడు ఆమె ఓ ట్రావెల్ బ్యాగ్‌ను వెంట తెచ్చుకుంది. బ్రౌన్, క్రీమ్ కలర్స్‌తో ఉన్న ఈ బ్యాగ్ చూడటానికి మామూలుగా ఉన్న.. ధర మాత్రం అదరగొడుతోంది. ఆ బ్యాగ్ ప్రముఖ లూయిస్ విట్టన్ బ్రాండ్‌కు చెందిన కాగా.. దాని ఖరీదు అక్షరాల రూ.1,22,860 అట. మీరు చదువుతున్నది నిజమే.. ఆ ఖరీదుతో మూడు తులాల బంగారాన్ని కొనచ్చని చెబుతున్నారు. కాగా ఇదే బ్రాండ్‌కు చెందిన ఓ హ్యాండ్ బ్యాగ్‌ను ఇటీవల సమంత వేసుకుంది. దాని ఖరీదు కూడా ఇంచుమించు లక్ష వరకు ఉండొచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే దీపికా పదుకొనే నటించిన చపాక్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కగా.. వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు 83 మూవీలోనూ దీపికా నటిస్తోంది. అందులో రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తుండగా.. ఆయన భార్య రోమీ భాటియాగా దీపిక కనిపించనుంది. పెళ్లి తరువాత వారిద్దరు కలిసి నటిస్తోన్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.