Corona: హైదరాబాద్‌లోని ఆ ప్రాంతంలో వారం పాటు అన్నీ బంద్..!

| Edited By:

May 03, 2020 | 8:03 PM

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే వనస్థలిపురం ప్రాంతంలో మాత్రం కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కాలనీలు, హుడాసాయి నగర్, ఎ, బి టైప్ కాలనీలు, ఎస్‌కేడీ నగర్‌, కమలానగర్, సచివాలయ నగర్ కాలనీలను రేపటి నుంచి వారం రోజులుగా కంటైన్మెంట్‌ జోన్‌లుగా ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో వారం రోజుల పాటు రైతు బజార్, పండ్ల మార్కెట్‌లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయా ప్రాంతంలో వారం […]

Corona: హైదరాబాద్‌లోని ఆ ప్రాంతంలో వారం పాటు అన్నీ బంద్..!
Follow us on

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే వనస్థలిపురం ప్రాంతంలో మాత్రం కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కాలనీలు, హుడాసాయి నగర్, ఎ, బి టైప్ కాలనీలు, ఎస్‌కేడీ నగర్‌, కమలానగర్, సచివాలయ నగర్ కాలనీలను రేపటి నుంచి వారం రోజులుగా కంటైన్మెంట్‌ జోన్‌లుగా ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో వారం రోజుల పాటు రైతు బజార్, పండ్ల మార్కెట్‌లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయా ప్రాంతంలో వారం రోజుల పాటు అన్నీ మూతపడనున్నాయి. అలాగే కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలోని నివాసాల పరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించనున్నారు. కాగా వనస్థలిపురం పరిధిలో మూడు కుటుంబాలు ,తొమ్మిది కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా..  169 కుటుంబాలు క్వారంటైన్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 54 ప్రాంతాలకు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. అందులో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9 కేంద్రాలు, హైదరాబాద్ పరిధిలో 30 కంటైన్మెంట్ కేంద్రాలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 కేంద్రాలు ఉన్నాయి.

Read This Story Also: కరోనా సాకుతో పాక్‌ వక్రబుద్ధి.. హఫీజ్‌ సయీద్‌ సహా ఉగ్రవాదులకు జైలు నుంచి విముక్తి..!