కరోనా సాకుతో పాక్‌ వక్రబుద్ధి.. హఫీజ్‌ సయీద్‌ సహా ఉగ్రవాదులకు జైలు నుంచి విముక్తి..!

కరోనా వైరస్‌ సాకుతో పాక్‌ ప్రభుత్వం మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. జైళ్లలో ఉన్న ఖైదీలకు వైరస్‌ సోకుతుందన్న కారణంతో వారిని ఇళ్లకు పంపింది. అందులో లష్కరే తోయిబా అధినేత హఫీజ్‌ సయీద్ సహా అనేక మంది ఉగ్రవాదులు ఉన్నారు. కాగా లాహోర్‌లోని ఓ జైళ్లో 50 మంది ఉగ్రవాదులకు కరోనా సోకినట్లుగా ఆ రాష్ట్ర సీఎం తెలిపారు. దీన్ని సాకుగా చూపుతూ ఉగ్రవాదులకు విముక్తి కలిగించి.. దేశంలో స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు. కాగా బ్లాక్‌ […]

కరోనా సాకుతో పాక్‌ వక్రబుద్ధి.. హఫీజ్‌ సయీద్‌ సహా ఉగ్రవాదులకు జైలు నుంచి విముక్తి..!
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 3:40 PM

కరోనా వైరస్‌ సాకుతో పాక్‌ ప్రభుత్వం మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. జైళ్లలో ఉన్న ఖైదీలకు వైరస్‌ సోకుతుందన్న కారణంతో వారిని ఇళ్లకు పంపింది. అందులో లష్కరే తోయిబా అధినేత హఫీజ్‌ సయీద్ సహా అనేక మంది ఉగ్రవాదులు ఉన్నారు. కాగా లాహోర్‌లోని ఓ జైళ్లో 50 మంది ఉగ్రవాదులకు కరోనా సోకినట్లుగా ఆ రాష్ట్ర సీఎం తెలిపారు. దీన్ని సాకుగా చూపుతూ ఉగ్రవాదులకు విముక్తి కలిగించి.. దేశంలో స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు.

కాగా బ్లాక్‌ లిస్ట్ నుంచి తప్పుకోవాలంటే ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలని ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) పాక్‌ను హెచ్చరించింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం గత కొన్ని నెలల్లో అక్కడ చాలా మంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు కరోనా సాకుతో ఉగ్రవాదులను విడుదల చేసి మరో దుశ్చర్యకు పాల్పడబోతోంది.

ఇదిలా ఉంటే మరోవైపు కరోనా కాలంలోనూ పాక్‌ తన వక్రబుద్ధిని చూపుతూనే ఉంది. కశ్మీర్‌ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడమే కాకుండా.. సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దుల నుంచి కరోనా రోగులను పంపి వైరస్ వ్యాప్తికి కుట్ర పన్నుతున్నట్లు ఇప్పటికే నిఘా వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read This Story Also: కరోనా లాక్‌డౌన్‌: అమెరికాలో అత్యధిక మంది చూసిన చిత్రం మనదే..!