షాకింగ్: కటింగ్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా.!

|

Apr 26, 2020 | 8:08 AM

మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా బార్గావ్ గ్రామంలో ఓ కటింగ్ షాపుకు వెళ్ళిన ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఇండోర్ నుంచి తన స్వస్థలానికి వచ్చిన ఓ యువకుడు ఏప్రిల్ 5న ఆ షాపుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక అతని నుంచి ఆ షాపుకు వెళ్ళిన మరో ఆరుగురు గ్రామస్తులకు కూడా కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీనితో వారితో కాంటాక్టుతో ఉన్న […]

షాకింగ్: కటింగ్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా.!
Follow us on

మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా బార్గావ్ గ్రామంలో ఓ కటింగ్ షాపుకు వెళ్ళిన ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఇండోర్ నుంచి తన స్వస్థలానికి వచ్చిన ఓ యువకుడు ఏప్రిల్ 5న ఆ షాపుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక అతని నుంచి ఆ షాపుకు వెళ్ళిన మరో ఆరుగురు గ్రామస్తులకు కూడా కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు.

దీనితో వారితో కాంటాక్టుతో ఉన్న 12 మందిని క్వారంటైన్‌కు తరలించి.. గ్రామం మొత్తాన్ని సీల్ వేశారు. కాగా, వీరందరికీ ఒకే టవల్, పనిముట్లు వాడటంతోనే కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. కాబట్టి కరోనా తగ్గేంత వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని వారు సూచిస్తున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 1952 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 92 మంది మృతి చెందారు. అటు 210 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..

నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మరణించాడట.. అసలు దీనిలో నిజమెంత.!