చరిత్రలో ముస్లింలు ప్రార్థనలకు దూరమైన సందర్భాలివే!

| Edited By: Pardhasaradhi Peri

Apr 25, 2020 | 4:28 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో ఇళ్లల్లోనే ప్రార్థనలు చేయాలని అనేక దేశాల ప్రభుత్వాలు, ముస్లిం పెద్దలకు సూచించారు. సహజంగా రంజాన్‌ మాసంలోనే సామూహిక ప్రార్థనలు, తమకు తోచినంతలో దానధర్మాలు చేయడం..

చరిత్రలో ముస్లింలు ప్రార్థనలకు దూరమైన సందర్భాలివే!
Follow us on

ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఆరంభమైంది. శుక్రవారం రాత్రి ఏడుగంటలకు ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ఆరంభమైనట్టు ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. కానీ ప్రతీ ఏడాదిలా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి వల్ల ముస్లింలు పండుగను ఉత్సాహంగా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో ఇళ్లల్లోనే ప్రార్థనలు చేయాలని అనేక దేశాల ప్రభుత్వాలు, ముస్లిం పెద్దలకు సూచించారు. సహజంగా రంజాన్‌ మాసంలోనే సామూహిక ప్రార్థనలు, తమకు తోచినంతలో దానధర్మాలు చేయడం, ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, పెద్ద ఎత్తున విందులు నిర్వహించడం వంటివి చేస్తూంటారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా రంజాన్ పండుగ సందర్బంగా.. ముస్లిం సోదరులకు విందును ఏర్పాటు చేస్తాయి.  కానీ ప్రస్తుతం సామాజిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో అవేమీ లేకుండానే సాధారణంగా జరుపుకొంటున్నారు ముస్లింలు. కాగా చరిత్రలో ముస్లింలు కొన్ని ఘటనలు, మహమ్మారుల వల్ల వారి ప్రార్థనలకు దూరమయ్యారు. గతంలో మసీదులు మూసేయడం, సామూహికంగా సమావేశాలు వంటివి రద్దయిన ఘటనలు చాలా సార్లు జరిగిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి.

అవి ఎప్పుడెప్పుడంటే:

1. క్రీస్తుశకం 930లో ఖుర్మాతియన్ దాడులు
2. 19వ శతాబ్దంలో కలరా వ్యాధి వల్ల
3. 1979లో గ్రాండ్ మసీదు ముట్టడి
4. 2014లో ఎబోలా వల్ల
5. 2016లో సిరియా యుద్ధం కారణంగా ముస్లింలు రంజాన్ మాసంలో ప్రార్థనలకు దూరమయ్యారు.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..