హిందీలో ‘హిట్‌’ రీమేక్.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరో..

| Edited By:

Jul 15, 2020 | 3:57 PM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన సినిమా 'హిట్'. చిన్న సినిమాగా విడుదలై ఈ సినిమా పెద్ద హిట్‌నే అందుకుంది. ఈ చిత్రంతో శైలేష్ కొలను డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా హిందీ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమౌతోంది. 'ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా....

హిందీలో హిట్‌ రీమేక్.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరో..
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన సినిమా ‘హిట్’. చిన్న సినిమాగా విడుదలై ఈ సినిమా పెద్ద హిట్‌నే అందుకుంది. ఈ చిత్రంతో శైలేష్ కొలను డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా హిందీ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమౌతోంది. ‘ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా.. విడుదలైన మొదటి రోజే మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది హిట్’.

దీంతో ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ యంగ్ హీరో రాజ్ కుమార్ రావ్ నటిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగులోనే దర్శకత్వం వహించిన శైలేష్.. హిందీ సినిమాకి కూడా డైరెక్ట్ చేయబోతున్నారట. చిన్న చిన్న మార్పులు చేసి హిందీలో హిట్ చిత్రాన్ని తీయబోతున్నారట. హిందీ రీమేక్ 2021లో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనుంది. నటీనటులు, సాంకేతిక విభాగానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా ఇప్పటికే నాని నటించిన జెర్సీ సినిమా హిందీలో తెరకెక్కుతోంది. షాహిద్ నటిస్తోన్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు హిట్ సినిమాతో మరోసారి బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు దిల్ రాజు.

ఇక మరోవైపు తెలుగు హిట్ స్వీక్వెల్‌కీ ప్రయత్నాలు మొదలయ్యాయి. పార్ట్-1 క్లైమాక్స్‌లోనే హింట్ ఇచ్చిన డైరెక్టర్.. దానికి తగ్గట్టుగా స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నారట. అయితే మరి ఈ హిట్ సీక్వెల్‌లో విశ్వక్ నటిస్తాడా? లేక మరో హీరో కనిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Read More:

కొత్త జిల్లాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు..

హైదరాబాద్‌లో కరోనా జోరు.. హైరిస్క్ ప్రాంతాల్లో కొత్త రూల్స్..