కలకలం సృష్టిస్తోన్న కోతి జ్వరం.. 200 కేసులు నమోదు

| Edited By:

Apr 18, 2020 | 11:02 AM

దేశ వ్యాప్తంగా ప్రజలు ఓ వైపు కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు చాప కింద నీరులాగా కోతి జ్వరం వ్యాపిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులతో అక్కడి ప్రభుత్వం సతమతమవుతుంటే..

కలకలం సృష్టిస్తోన్న కోతి జ్వరం.. 200 కేసులు నమోదు
Follow us on

దేశ వ్యాప్తంగా ప్రజలు ఓ వైపు కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు చాప కింద నీరులాగా కోతి జ్వరం వ్యాపిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులతో అక్కడి ప్రభుత్వం సతమతమవుతుంటే.. ఇప్పుడు కొత్తగా మంకీ ఫీవర్ ప్రభుత్వాన్ని, ప్రజలను మరింత భయపెట్టిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి రాష్ట్రంలోని 12 జిల్లాలకు వ్యాపించింది. సుమారు రెండు వందల కేసులు నమోదయ్యాయి. గత ఆదివారం ఉత్తరకన్నడ జిల్లా సిద్ధాపుర తాలూకాలోని కూలర్క గ్రామంలో 41 కేసులు వెలుగు చూశాయి. చిక్క మంగళూరు 10, శివ మొత్త జిల్లాలో ఏకంగా 146 కేసులు నమోదవడంతో.. అక్కడ కలకలం సృష్టిస్తోంది. దీంతో ఈ వైరస్‌పై కూడా వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వరుసగా నాలుగు రోజులు జ్వరం వస్తే.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Read More: 

యాంటీబాడీస్‌పై డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ ప్రకటన.. ఆ ఆశలపై నీళ్లు..