Music Director Ilayaraja Emotional: బాలు త్వరగా లేచి రా.. నీ కోసం నేను వేచి చూస్తున్నా అంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయ రాజా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఇళయ రాజా మాట్లాడుతూ.. మన ఇద్దరి జీవితం ప్రారంభం సినిమాతో మొదలైనా.. మన స్నేహం మాత్రం చిరస్మరణీయమైనది. ఆ సంగీతమే మన జీవితమైంది. మనకు ముఖ్యంగా జీవనాధారంగా మారింది. సంగీతం అనేది స్వరాలను విడిచి ఎలాగ ఉండలేదో… అలాగే మన స్నేహం ఎప్పుడూ విడిపోయేది కాదు. మనం గొడవపడ్డా అది స్నేహమే… గొడవ లేకున్నా అది స్నేహమే. నీకు నాకు మధ్య కొన్ని విబేధాలు వచ్చినా.. ప్రాణ మిత్రల మధ్య సహజం. నేను దేవుడిని ప్రార్థిస్తున్నా.. నువ్వు ఖచ్చితంగా తిరిగి వస్తావని నా మనసు చెబుతుంది. అది ఖచ్చితంగా జరగాలని నేను దేవుడిని కోరుకుంటున్నా. బాలూ త్వరగా రా అంటూ ఇళయ రాజా భావోద్వేగానికి గురయ్యారు.
Read More:
యూకే సంచలన నిర్ణయంః మాస్క్ లేకుండా బయటకొస్తే రూ.3 ఫైన్!
ఈ నెల 17 నుంచి ఇంటర్ ఆన్లైన్ తరగతులు
బ్రేకింగ్ః కరోనాను జయించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా