ఏపీలో ప్రారంభం కానున్న సినిమా హాళ్లు, రెస్టారెంట్లు!

| Edited By:

May 15, 2020 | 5:21 PM

గత 52 రోజులుగా.. దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు అన్నీ బంద్ అయిపోయాయి. అయితే ఆర్థిక కారణాల దృష్ట్యా కొద్ది రోజుల ముందే కేంద్రం కొన్ని మినహాయింపులతో..

ఏపీలో ప్రారంభం కానున్న సినిమా హాళ్లు, రెస్టారెంట్లు!
Follow us on

గత 52 రోజులుగా.. దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు అన్నీ బంద్ అయిపోయాయి. అయితే ఆర్థిక కారణాల దృష్ట్యా కొద్ది రోజుల ముందే కేంద్రం కొన్ని మినహాయింపులతో సడలింపులు చేసింది. దీంతో అక్కడక్కడ కిరాణా సూపర్ మార్కెట్లు, ప్రజా రవాణా, పాల దుకాణాలు, లిక్కర్ షాపులు పరిమిత సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇప్పుడు సినిమా హాళ్లు, రెస్టారెంట్లు కూడా తెరుచుకోబోతున్నాయట. 4వ దశ లాక్‌డౌన్‌లో కేంద్రం భారీగా సడలింపులు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

లాక్‌డౌన్ విరమణ ఎగ్జిట్ ప్లాన్‌లో భాగంగా.. హాటల్స్, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు ప్రారంభించేందుకు అవసరమైన ప్లాన్స్ రూపొందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించినట్టు సమాచారం. కాగా ఇప్పటికే సీఎం వలస కార్మికుల పట్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏపీకి వచ్చే వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ప్రజా రవాణా ఏర్పాటు చేశారు. అలాగే రోడ్డు వెంబడి నడిచి వచ్చే వలస కార్మికులకు ప్రత్యేకంగా భోజనం, తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.

అలాగే టెలీ మెడిసిన్ కూడా పటిష్ఠంగా అమలు చేసేందుకు జులై 1 నుంచి ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక మోటర్ సైకిల్‌ను సమకూర్చాలని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే రోజు 108, 104 సర్వీసుల కోసం 1060 అంబులెన్స్‌లు ప్రారంభించనున్నట్లు జగన్ తెలిపారు.

Read More:

లైవ్ అప్‌డేట్స్: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ హైలెవల్ మీటింగ్

మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!