కరోనా అలర్ట్: మాస్క్‌తో చిన్నారులకు డేంజర్!

చిన్నారులకు మాస్క్‌లు ఎంత వరకు శ్రేయస్కరం అన్నదానిపై చర్చ కొనసాగుతోంది. అయితే, రెండేళ్లలోపు చిన్నారులకు మాస్కులు అత్యంత ప్రమాదకరమని...

కరోనా అలర్ట్: మాస్క్‌తో చిన్నారులకు డేంజర్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 27, 2020 | 3:34 PM

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు దీనికి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో జాగ్రత్త చర్యలు ఒక్కటే ఆయుధంగా అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ పెట్టుకోవడం, ఎప్పటి కప్పుడు శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం తప్పని సరి అని చెబుతున్నారు. అయితే, ఈ క్రమంలోనే చిన్నారులకు మాస్క్‌లు ఎంత వరకు శ్రేయస్కరం అన్నదానిపై చర్చ కొనసాగుతోంది.

అయితే, రెండేళ్లలోపు చిన్నారులకు మాస్కులు అత్యంత ప్రమాదకరమని జపాన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు మాస్కులు ధరించడం వల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం చెబుతున్నారు. సాధారణంగా చిన్నారుల్లో శ్వాసమార్గం ఇరుకుగా ఉంటుందని.. మాస్కు ధరించినప్పుడు గాలి పీల్చితే అది గుండెపై భారం పెంచుతుందని ఈ కారణంగా రెండేళ్ల లోపు చిన్నారులకు మాస్క్‌లు వేయకపోవటమే మంచిదని సూచించారు.