కరోనా ఇంపాక్ట్: నడి రోడ్డుపైనే మరో మహిళ ప్రసవం

| Edited By:

Apr 18, 2020 | 12:10 PM

లాక్‌డౌన్ గర్భిణిలకు శాపంగా మారింది. కరోనా ఇంపాక్ట్‌తో మరో మహిళ రోడ్డుపైనే  ప్రసవించింది. శుక్రవారమే సూర్యపేటలో లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో రేష్మా అనే మహిళ నడి రోడ్డుపై ప్రసవించింది. ఆ ఘటన మరువకముందే మరో ఘటన కోయంబత్తూరులోని..

కరోనా ఇంపాక్ట్: నడి రోడ్డుపైనే మరో మహిళ ప్రసవం
Follow us on

లాక్‌డౌన్ గర్భిణిలకు శాపంగా మారింది. కరోనా ఇంపాక్ట్‌తో మరో మహిళ రోడ్డుపైనే  ప్రసవించింది. శుక్రవారమే సూర్యపేటలో లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో రేష్మా అనే మహిళ నడి రోడ్డుపై ప్రసవించింది. ఆ ఘటన మరువకముందే మరో ఘటన కోయంబత్తూరులోని సింగా నల్లూరులో చోటుచేసుకుంది. నిర్మాణం జరుగుతున్న భవనంలోనే ఉంటున్నారు భవన నిర్మాణ కార్మికులు. వారితో పాటు ఓ గర్బిణి కూడా ఉంటోంది. తెల్లవారు జామున గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ కరోనా కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్న బ్యారికేట్స్ దాటుకుని వెళ్లే లోపు ఆలస్యమైంది. దీంతో మహిళ నడిరోడ్డుపైనే స్థానిక మహిల సాయంతో ప్రసవించింది. అనంతరం ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

Read More: 

యాంటీబాడీస్‌పై డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ ప్రకటన.. ఆ ఆశలపై నీళ్లు..