చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్‌ను వేడుకోలు..

|

Apr 16, 2020 | 3:20 PM

దాయాది దేశమైన పాకిస్థాన్ ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్ వైపు చూస్తోంది. అక్కడ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సాయం చేయాలంటూ మోదీ సర్కార్‌ను కోరుతోంది. అమెరికా, బ్రెజిల్ దేశాల మాదిరిగానే హైడ్రాక్సీక్లోరోక్వీన్ డ్రగ్‌ను తమకు కూడా సరఫరా చేయాలని  అభ్యర్ధించింది. మలేరియా డ్రగ్ అయిన హైడ్రాక్సీక్లోరోక్వీన్ కరోనా బాధితులకు చికిత్స చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతోన్న విషయం విదితమే. ఇప్పటికే అమెరికా భారత్ నుంచి 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్యాబ్‌లెట్లను దిగుమతి […]

చేతులెత్తేసిన ఇమ్రాన్ ఖాన్.. మమ్మల్ని ఆదుకోండి అంటూ భారత్‌ను వేడుకోలు..
Follow us on

దాయాది దేశమైన పాకిస్థాన్ ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ భారత్ వైపు చూస్తోంది. అక్కడ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సాయం చేయాలంటూ మోదీ సర్కార్‌ను కోరుతోంది. అమెరికా, బ్రెజిల్ దేశాల మాదిరిగానే హైడ్రాక్సీక్లోరోక్వీన్ డ్రగ్‌ను తమకు కూడా సరఫరా చేయాలని  అభ్యర్ధించింది. మలేరియా డ్రగ్ అయిన హైడ్రాక్సీక్లోరోక్వీన్ కరోనా బాధితులకు చికిత్స చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతోన్న విషయం విదితమే.

ఇప్పటికే అమెరికా భారత్ నుంచి 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్యాబ్‌లెట్లను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు ఆ దేశంలో 6,505 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 124 మంది మృత్యువాతపడ్డారు. అంతేకాక తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కుంటోంది. కాగా, పాకిస్థాన్‌తో పాటు టర్కీ, మలేషియా దేశాలు హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం భారత్‌ను అభ్యర్దిస్తున్నాయి. ఇక ఈ దేశాలే అంతర్జాతీయంగా కశ్మీర్ అంశంలో ఇండియాను వ్యతిరేకించాయి.

Also Read:

‘అక్కడ ముస్లింలకు వైద్యం చేయరట’.. ఓవైసీ ఫైర్.. ‘కమ్యూనల్ వైరస్’ అంటూ ట్వీట్…

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

అక్షయ్ రూ.25 కోట్లు విరాళం ఇవ్వడం పెద్ద తప్పు.. శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు..