Telangana Curfew: క‌ర్ఫ్యూ టైమ్‌లో గ్రాండ్ గా పెళ్లి బారాత్… స్పాట్ కు చేరుకున్న పోలీసులు.. ఏం చేశారంటే..?

|

May 10, 2021 | 5:18 PM

నైట్ కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించి పెళ్లి బరాత్ నిర్వహించిన పెళ్లి కొడుకు, అతని తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీజే సిస్టమ్ యజమానిపైనా....

Telangana Curfew: క‌ర్ఫ్యూ టైమ్‌లో గ్రాండ్ గా పెళ్లి బారాత్... స్పాట్ కు చేరుకున్న పోలీసులు.. ఏం చేశారంటే..?
Baraat In Curfew
Follow us on

నైట్ కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించి పెళ్లి బరాత్ నిర్వహించిన పెళ్లి కొడుకు, అతని తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీజే సిస్టమ్ యజమానిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మెదక్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌ మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన నర్సింహులు అనే యువకుడికి ఈ నెల 8న వివాహం జరిగింది. అదే రోజు రాత్రికి కోవిడ్ నిబంధనలు ఏ మాత్రం పాటించకుండా బరాత్‌ నిర్వహించారు. ట్రాక్టర్‌పై డీజే సిస్టమ్ ఏర్పాటు చేసి సందడి చేశారు. పరిమితికి మించి అతిథులు హాజరుకాగా ఒక్కరు కూడా భౌతికదూరం పాటించలేదు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కోవిడ్‌, నైట్ కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించారు. ఈ మేరకు డీజే సౌండ్‌ సిస్టం, సౌండ్‌ బాక్స్‌లను సీజ్‌ చేశారు. వరుడు నర్సింహులు, అతడి తండ్రి, డీజే సౌండ్‌ సిస్టం యజమానిపై కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఎక్కడ చూసిన కరోనా భయం..రాష్ట్రంలో వైరస్‌ స్వైర విహారం చేస్తోంది. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తోంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, అంత్యక్రియలకు అతి తక్కువ మందితోనే నిర్వహించుకోవాలని నిబంధనలు విధించింది. అతిక్రమించిన వారిపై కఠినచర్యలు తీసుకునేందుకు వెనుకాడం లేదు.

Also Read: 104 వ్యవస్థ మరింత బలోపేతం.. క‌రోనాపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష.. కీల‌క ఆదేశాలు

యమునా నదిలో తేలియాడుతున్న డజన్ల కొద్దీ మృతదేహాలు, స్థానికుల్లో భయాందోళనలు, యూపీ జిల్లాల్లో అధికారులు అప్రమత్తం