కరోనా సంక్షోభం: తెలుగు రాష్ట్రాలకు నిధులను విడుదల చేసిన కేంద్రం

| Edited By:

Apr 20, 2020 | 9:49 PM

కరోనా సంక్షోభంలో ఉన్న రాష్ట్రాలకు కాస్త ఊరట కలిగిస్తూ.. సెంట్రల్‌ ట్యాక్స్‌లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఏప్రిల్ నెల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ కలిపి..

కరోనా సంక్షోభం: తెలుగు రాష్ట్రాలకు నిధులను విడుదల చేసిన కేంద్రం
Follow us on

కరోనా సంక్షోభంలో ఉన్న రాష్ట్రాలకు కాస్త ఊరట కలిగిస్తూ.. సెంట్రల్‌ ట్యాక్స్‌లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఏప్రిల్ నెల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.46,038 వేల కోట్ల నిధులను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1892.64 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.982 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ కంటే ఏపీకి రెట్టింపు నిధులు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల కింద అత్యధికంగా యూపీకి రూ.8255.19 కోట్లు.. అత్యల్పంగా గోవాకు రూ.177.72 కోట్లు విడుదల చేసింది. కాగా రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలు ఈ కింది పట్టికలో కలవు.

Read More: 

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

తాతయ్యకు దేవాన్ష్ జన్మదిన శుభాకాంక్షలు.. ఎలా చెప్పాడంటే..

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా

ఈ-పాస్ ఎలా తీసుకోవాలి? ఈ వీడియో చూడండి..