Covid Positive Woman: ఢిల్లీలో తప్పించుకుని హైదరాబాద్ వచ్చిన కోవిడ్ పాజిటివ్ యువతి.. మరోసారి తప్పించుకుంటుండగా..

| Edited By: Anil kumar poka

Dec 03, 2021 | 8:02 PM

విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకుంది. కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ అని తేలింది. అధికారుల కల్లుగప్పిన యువతి పేరెంట్స్ చెంతకు చేరింది. అప్రమత్తమైన పోలీసులు పట్టుకునే క్రమంలో మరోసారి తప్పించుకు..

Covid Positive Woman: ఢిల్లీలో తప్పించుకుని హైదరాబాద్ వచ్చిన కోవిడ్ పాజిటివ్ యువతి.. మరోసారి తప్పించుకుంటుండగా..
Covid
Follow us on

Covid Cases: విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకుంది. కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ అని తేలింది. అధికారుల కల్లుగప్పిన యువతి పేరెంట్స్ చెంతకు చేరింది. అప్రమత్తమైన పోలీసులు పట్టుకునే క్రమంలో మరోసారి తప్పించుకునేందుకు యత్నించింది. విదేశాల నుంచి వచ్చిన కరోనా బాధితురాలు హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో ప్రత్యక్షమైంది. కుత్బుల్లాపూర్‌కు చెందిన యువతి గురువారం శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకుంది. విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అధికారులు హాస్పిటల్‌కు తరలించే క్రమంలో అక్కడి నుంచి తప్పించుకున్న యువతి రిడ్జ్ టవర్స్‌లో ఉంటున్న తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంది.

అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు పాస్‌పోర్ట్ ఆధారంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, వైద్యాధికారులు రిడ్జ్ టవర్స్‌కు అక్కడి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేసింది. అదుపులోకి తీసుకున్న పోలీసులు గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించారు. అక్కడే ఆ యువతికి చికిత్స అందించనున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి: Jawad Cyclone Live: జెట్‌ స్పీడ్‌తో దూసుకొస్తున్న జొవాద్‌.. సుడులు తిరుగుతూ విశాఖ తీరం వైపు..

Health Tips : కాలీఫ్లవర్ తెగ ఇష్టంగా తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..