
కోవిడ్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సార్క్ దేశాలన్నింటి కోసం భారత్ ‘సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ అత్యవసర నిధి కోసం భారత్ తరఫున ప్రధాని మోదీ 10 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. మరోవైపు ఈ అత్యవసర నిధి కోసం ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్ దేశాలు సైతం ముందుకొచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే నేపాల్(10 కోట్లు), భూటాన్(1 మిలియన్ డాలర్లు) దేశాలు తమ వంతుగా విరాళాన్ని ప్రకటించాయి. వారికి మోదీ కృతఙ్ఞతలు తెలిపారు. ఇక ఈ అత్యవసర నిధికి విరాళం అందించాయి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు. ఆప్ఘనిస్తాన్ 1 మిలియన్ డాలర్లు, శ్రీలంక 5మిలియన్ డాలర్లు, బంగ్లాదేశ్ 1.5 మిలియన్ డాలర్లు అత్యవసర నిధిని కేటాయించాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానిలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సార్క్ దేశాలతో కలిసి భారత్ ముందడుగు వేయడం ఎంతో గొప్ప విషయమని అమెరికా ప్రశంసించిన విషయం తెలిసిందే.
Read This Story Also: కరోనా భయం.. జైల్లో అల్లర్లు.. 23 మంది మృతి..!