అక్షయ్ రూ.25 కోట్లు విరాళం ఇవ్వడం పెద్ద తప్పు.. శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు..

|

Apr 16, 2020 | 2:10 PM

కరోనా మహమ్మారిపై పోరాటంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 25 కోట్ల విరాళం ఇవ్వడం పెద్ద తప్పంటూ సీనియర్ యాక్టర్, కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడమంటే ఇతరులను కించపరచడమేనని మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కరోనాపై పోరులో భాగంగా అక్షయ్ కుమార్ పీఎం కేర్స్ ఫండ్ కు రూ. 25 కోట్ల భారీ డొనేషన్ ఇచ్చాడు. అంతేకాక ముంబై మున్సిపల్ […]

అక్షయ్ రూ.25 కోట్లు విరాళం ఇవ్వడం పెద్ద తప్పు.. శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు..
Follow us on

కరోనా మహమ్మారిపై పోరాటంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 25 కోట్ల విరాళం ఇవ్వడం పెద్ద తప్పంటూ సీనియర్ యాక్టర్, కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడమంటే ఇతరులను కించపరచడమేనని మండిపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. కరోనాపై పోరులో భాగంగా అక్షయ్ కుమార్ పీఎం కేర్స్ ఫండ్ కు రూ. 25 కోట్ల భారీ డొనేషన్ ఇచ్చాడు. అంతేకాక ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు కూడా రూ. 3 కోట్ల విరాళం అనౌన్స్ చేసి.. పారిశుధ్య కార్మికులకు అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కోసం ఈ డబ్బును అందజేస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే ఈ డొనేషన్ విషయమై బాలీవుడ్ సీనియర్ నటుడు, కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా తప్పు బట్టారు.

డొనేషన్లు ఇవ్వడంలో తప్పులేదని.. అయితే దాన్ని బహిరంగంగా ఎందుకు చెప్పుకోవటం అని ప్రశ్నించారు. అంతేకాకుండా భారీ మొత్తంలో విరాళం ఇవ్వడం ఇతరులను కించపరచడం అవుతుందన్నారు. ఎందుకంటే మిగిలిన వారు అక్షయ్ ఇచ్చిన డొనేషన్‌తో పోల్చుకుని.. తామిచ్చేది చిన్న మొత్తం అని భావించి విరాళాలు ఇవ్వడం మానేస్తారన్నారు. కాగా, ప్రపంచంలో ఎక్కడా కూడా సెలెబ్రిటీలు ఇలా భారీ విరాళాలు ఇచ్చి గొప్పలు చెప్పుకోలేదంటూ తీవ్రంగా విమర్శించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ‘ ఒకవేళ ఎవరైనా రూ. 25 కోట్ల విరాళం ఇచ్చారని నాకు తెలిస్తే.. నేను ఇచ్చే విరాళం ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ వారికి తోచిన సాయం అందిస్తున్నారు. దీన్ని కాంపిటీషన్ లాగ మార్చోద్దని అన్నారు’. ఇక ప్రధాని విధించిన లాక్ డౌన్ గురించి మాట్లాడిన సిన్హా.. ప్రధాని నిర్ణయం మెచ్చుకోదగినదని.. కానీ బాగా ఆలస్యమైందని అన్నారు. లాక్ డౌన్ తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే రోజువారీ కూలీలు, జూనియర్ ఆర్టిస్టులు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన అన్నారు. అందరూ కూడా ఇలాంటివారికి సాయం చేయాలనీ కోరారు. మరి శత్రుఘ్న సిన్హా చేసిన ఈ కామెంట్స్‌కు అక్షయ్ కుమార్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.

Also Read:

‘అక్కడ ముస్లింలకు వైద్యం చేయరట’.. ఓవైసీ ఫైర్.. ‘కమ్యూనల్ వైరస్’ అంటూ ట్వీట్…

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

కరోనా వేళ.. ట్రంప్ టీంలో ఆరుగురు భారతీయులకు చోటు.. ఎవరో తెలుసా..