Flash News: మోదీ ప్రకటనకు ముందే.. లాక్ డౌన్ పొడిగించిన మరో రాష్ట్రం..

|

Apr 11, 2020 | 8:46 AM

Coronavirus Outbreak: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కొనసాగుతున్న మూడు వారాల లాక్ డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు రాజస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా నమోదైన 98 పాజిటివ్ కేసులు కలిపి మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 561కి చేరింది. ఇక ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఎనిమిది మంది మృతి చెందినట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే […]

Flash News: మోదీ ప్రకటనకు ముందే.. లాక్ డౌన్ పొడిగించిన మరో రాష్ట్రం..
Follow us on

Coronavirus Outbreak: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కొనసాగుతున్న మూడు వారాల లాక్ డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు రాజస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా నమోదైన 98 పాజిటివ్ కేసులు కలిపి మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 561కి చేరింది. ఇక ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఎనిమిది మంది మృతి చెందినట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ లాక్ డౌన్‌ను మే 1 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అలాగే ఒడిశా కూడా ఈ నెల చివరి వరకు లాక్ డౌన్‌ను అమలు చేయనుంది. కాగా, లాక్ డౌన్ విషయంపై రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ ‘ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ప్రజల సంరక్షణే ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు. అటు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ రూల్ శుక్రవారం నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. ఇక ఇప్పటికే పొగాకు లేదా పొగాకుయేతర ఉత్పత్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి: కరోనా లాక్ డౌన్.. ఏపీ హైకోర్టు మరో కీలక నిర్ణయం..