Breaking: ఐసోలేషన్ సెంటర్‌కు ఏపీ ఎమ్మెల్యే

| Edited By:

Mar 28, 2020 | 7:07 PM

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనాపై ఇప్పటికే ఓ కమిటీని కూడా వేసిన ఏపీ ప్రభుత్వం..

Breaking: ఐసోలేషన్ సెంటర్‌కు ఏపీ ఎమ్మెల్యే
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనాపై ఇప్పటికే ఓ కమిటీని కూడా వేసిన ఏపీ ప్రభుత్వం.. అనుమానితులను వెంటనే ఐసోలేషన్ సెంటర్లకు పంపుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోకి సైతం ఎవ్వరినీ అనుమతించడం లేదు. మరోవైపు వాలంటీర్లు, అధికారుల  నుంచి ఎప్పటికప్పుడు సమచారాన్ని సేకరిస్తున్నారు అధికారులు. ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా 14కు చేరుకోగా.. చర్యలను మరింత ముమ్మరం చేసింది ప్రభుత్వం.

ఇదిలా ఉంటే తాజాగా కరోనా సోకిందన్న అనుమానంతో గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యేను అధికారులు ఐసోలేషన్‌కి తరలించారు. ఇటీవల సదరు ఎమ్మెల్యే బావమరిది, ఆయన భార్య ఢిల్లీకి వెళ్లి వచ్చారు. వారికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఎమ్మెల్యే బావమరిది ఇచ్చిన విందులో ఆయన పాల్గొనగా..  ఎమ్మెల్యేకు కూడా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానంతో ఐసోలేషన్‌కి తరలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను తరలించి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Read This Story Also: మలయాళ హిట్ రీమేక్‌లో రానా..?