Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • విశాఖ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కు లేఖ రాసిన డాక్టర్ సుధాకర్. తనకు అందిస్తున్న వైద్య సేవలపై డాక్టర్ సుధాకర్ ఆందోళన. మెరుగైన సౌకర్యాలు కలిగిన ఆసుపత్రికి వెళ్ళేందుకు అనుమతించాలని విజ్ఞప్తి.
  • ఢిల్లీ మే 31 వ తేదీ మోడీ మన్ కీ బాత్‌ కార్యక్రమం. మన్ కి బాత్ లో ...లాక్ డౌన్ 5.0 పై ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం. లాక్ డౌన్ 4.0 చివరి రోజు మే 31. పిఎం మోడీ తన ప్రసంగంలో లాక్డౌన్ స్ఫూర్తిని , దేశంలో చాలా ప్రాంతాల్లో మరింత సడలింపులు వంటి వాటి పై మాట్లాడే అవకాశం ఉందంటున్న విశ్వసనీయ వర్గాల సమాచారం.
  • కరోనా నుంచి కోలుకున్న ఒక నెల పసిపాప. ముంబై లోని సియాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు. పసిపాప కి చప్పట్లు కొడుతూ...సెండ్ ఆఫ్ ఇచ్చిన వైద్యులు, సిబ్బంది.
  • సినిమా షూటింగ్ లు, థియేటర్ ల ఓపెనింగ్ తదితర అంశాలపై సినీ ప్రముఖులతో సమావేశమైన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుంది. మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశమైన మంత్రి శ్రీనివాస్ యాదవ్.
  • అమరావతి: మహానాడు.. కరోనా వైరస్ విజృంభణ- వలస కార్మికుల కష్టాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎంపీ గల్లా జయదేవ్.. తీర్మానాన్ని బలపరిచిన మాజీ మంత్రి కేఎస్ జవహర్, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం గల్లా జయదేవ్, టీడీపీ ఎంపీ 38వ మహానాడు జూమ్ టెక్నాలజీ ద్వారా నిర్వహించడం చూస్తే కరోనా వైరస్ విజృంభణ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇకపై కరోనాకు ముందు తర్వాత అన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి. గ్లోబల్ క్రైసిస్ లో ఇదే పెద్దది. స్పానిష్ ఫ్లూ వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. గల్లా జయదేవ్, టీడీపీ ఎంపీ.

మలయాళ హిట్ రీమేక్‌లో రానా..?

ఇటీవల కాలంలో మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రాల్లో 'ఏక్ అయ్యప్పన్ కుషియుమ్' చిత్రం ఒకటి. ఈ మూవీని ఇప్పుడు తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.
Rana in Malayal hit remake, మలయాళ హిట్ రీమేక్‌లో రానా..?

ఇటీవల కాలంలో మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రాల్లో ‘ఏక్ అయ్యప్పన్ కుషియుమ్’ చిత్రం ఒకటి. ఈ మూవీని ఇప్పుడు తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీ రీమేక్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ పాత్ర కోసం రానా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అందులో పృథ్వీ రాజ్‌ చేసిన పాత్ర కోసం రానాను సంప్రదించగా.. అతడు ఓకే చెప్పినట్లు సమాచారం.

బిజు పాత్ర కోసం బాలయ్యను సంప్రదించినట్లు వార్తలు రాగా అందులో నిజం లేనట్లు టాక్‌. ఇక ఈ మూవీకి డైరక్టర్, మిగిలిన పాత్రాధారుల కోసం ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా కరోనా నేపథ్యంలో ఇప్పుడు షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఆ బ్రేక్‌ ముగిసిన తరువాత ఈ రీమేక్‌కు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రానా నటించిన హాథీ మేరీ సాథీ(తెలుగులో అరణ్య) సినిమాను మామూలుగా వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడింది.

Read This Story Also: కరోనా లాక్‌డౌన్.. మరో బాధ్యత తీసుకున్న సుకుమార్.. ఏం చేస్తున్నారంటే..!

Related Tags