మాస్క్ ఇప్పుడు సంజీవ‌ని…వృద్ధురాలికి మంత్రి సాయం

మాస్క్ ఇప్పుడు మ‌నుషుల ప్రాణాల‌ను కాపాడే సంజీవ‌నిగా మారిపోయింది. దేశంలోనే చాలా రాష్ట్రాలు మాస్క్ లు లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే చ‌ర్య‌లు తీస‌కుంటామ‌ని హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే కూడా కొంద‌రు మాస్క్ ను లైట్ తీస్కోని..ప్ర‌మాదాన్ని పిలిచి తెచ్చుకుంటున్నారు. అయితే మాస్క్ గురించి తెలియ‌ని వ‌య‌సు పైబడినవారు కూడా కొంద‌రున్నారు. అలా వ‌య‌సు పైబ‌డిన ఓ మ‌హిళ మాస్క్ పెట్టుకోకుండా క‌నిపించ‌డంతో ..ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవగాహన కల్పించారు. తెల్లరేషన్ కార్దుదారులకు క‌రోనా క‌ష్ట‌కాలంలో […]

మాస్క్ ఇప్పుడు సంజీవ‌ని...వృద్ధురాలికి మంత్రి సాయం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 17, 2020 | 12:51 PM

మాస్క్ ఇప్పుడు మ‌నుషుల ప్రాణాల‌ను కాపాడే సంజీవ‌నిగా మారిపోయింది. దేశంలోనే చాలా రాష్ట్రాలు మాస్క్ లు లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే చ‌ర్య‌లు తీస‌కుంటామ‌ని హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే కూడా కొంద‌రు మాస్క్ ను లైట్ తీస్కోని..ప్ర‌మాదాన్ని పిలిచి తెచ్చుకుంటున్నారు. అయితే మాస్క్ గురించి తెలియ‌ని వ‌య‌సు పైబడినవారు కూడా కొంద‌రున్నారు. అలా వ‌య‌సు పైబ‌డిన ఓ మ‌హిళ మాస్క్ పెట్టుకోకుండా క‌నిపించ‌డంతో ..ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవగాహన కల్పించారు.

తెల్లరేషన్ కార్దుదారులకు క‌రోనా క‌ష్ట‌కాలంలో సాయంగా ప్ర‌భుత్వం బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో వాటిని తీసుకునేందుకు మహబూబ్ నగర్‌లోని బ్యాంకులకు జనాల తాకిడి పెరిగింది. డబ్బులు విత్ డ్రా చేసేందుకు స్థానికులు అధిక సంఖ్య‌లో తరలివచ్చారు. వారిలో కొందరు మాస్క్ లు ధ‌రించ‌క‌పోవ‌డంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్..మాస్ ప్రాముఖ్య‌త‌ను వివ‌రించి చెప్పారు. ఎస్‌బీఐ బ్యాంకులో మాస్క్ ధరించని ఓ వృద్ధురాలికి ఆయన మాస్క్ అందించారు. ఐతే ఆమెకు కట్టుకోవ‌డం రాక‌పోవ‌డంతో మంత్రే స్వయంగా మాస్క్ కట్టారు.