ఏపీలో ఒక్క రోజు ఎన్ని కేసులంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 765 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఏపీలో ఒక్క రోజు ఎన్ని కేసులంటే..?
Follow us

|

Updated on: Jul 04, 2020 | 4:28 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 765 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 727 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందినవి 38 ఉన్నాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 17,699కి చేరింది. ఇందులో 9,473 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,008 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 218కి చేరింది.

Also Read: కరోనా మృతుల అంత్యక్రియలపై ఏపీ ప్రభుత్వం సూచనలు..

మరోవైపు గడిచిన 24 గంటల్లో 24,962 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 762 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక ఆదివారం 311 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 12 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 127, చిత్తూరు 67, ఈస్ట్ గోదావరి 102, గుంటూరు 60, కడప 73, కృష్ణ 70, కర్నూలు 118, నెల్లూరు 27, ప్రకాశం 57, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 9, విజయనగరం 13, వెస్ట్ గోదావరిలో 4 కేసులు నమోదయ్యాయి.

Also Read: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి టికెట్‌లెస్ ప్రయాణం..!