దీపావళి నాటికి కరోనా ఖతం అయ్యే ఛాన్స్ ఉందన్న కేంద్రమంత్రి

కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గుడ్ న్యూస్ వినిపించారు. ఈ సంవత్సరం దీపావళి నాటికి కరోనా మహమ్మారి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే కొద్ది నెలల్లో దీపావళి నాటికి కరోనా మహమ్మారి వ్యాప్తి కొంతవరకూ..

దీపావళి నాటికి కరోనా ఖతం అయ్యే ఛాన్స్ ఉందన్న కేంద్రమంత్రి
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2020 | 11:44 AM

కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గుడ్ న్యూస్ వినిపించారు. ఈ సంవత్సరం దీపావళి నాటికి కరోనా మహమ్మారి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే కొద్ది నెలల్లో దీపావళి నాటికి కరోనా మహమ్మారి వ్యాప్తి కొంతవరకూ అదుపులోకి తీసుకురాగలుగుతామని అన్నారు. అనంత్ కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషన్ ఫస్ట్ వెబ్ సెమినార్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. డాక్టర్ దేవీ ప్రసాద్ శెట్టి, డాక్టర్ సీఎన్ మంజునాథ్ తదితర నిపుణులు తెలిపిన విధంగా కొంతకాలం తరువాత కూడా ఇది మిగిలిన వైరస్‌ల మాదిరిగానే.. ఒక సాధారణ సమస్యగా మిగిలిపోతుందన్నారు. కాగా కోవిడ్ మనకెన్నో కొత్త విషయాలను నేర్పిందని, ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మన జీవన శైలిలో వివిధ మార్పులు చేసుకుంటూ, పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కాగా ఇదిలా ఉంటే ఈ ఏడాది చివరినాటికి టీకా వస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్దన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More:

వికలాంగుడిగా కనిపించనున్న యంగ్ హీరో?

కేజీఎఫ్‌-2లో ప్రకాష్ రాజ్ పాత్ర అదేనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ప్రపంచ వ్యాప్తంగా 2.53 కోట్ల‌కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు