జూన్​ 6 వరకు గుంటూరు మిర్చి యార్డు క్లోజ్…

రెండు రోజులుగా గుంటూరు సిటీలో నమోదైన కేసుల్లో... యార్డు ద‌గ్గ‌ర్లోని మార్కెట్​ వ్యాపారులు ఉండటంతో ముందు జాగ్రత్త చ‌ర్య‌ల్లో భాగంగా యార్డును క్లోజ్ చెయ్యాల‌ని నిర్ణయించారు.

జూన్​ 6 వరకు గుంటూరు మిర్చి యార్డు క్లోజ్...
Follow us

|

Updated on: Jun 02, 2020 | 4:06 PM

ఈ నెల 6వ తేదీ వరకు గుంటూరు మిర్చి యార్డును మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. కోవిడ్-19 కేసులు పెరుగుతూ..ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ నేపథ్యంలో అధికారులు ఈ డెషిస‌న్ తీసుకున్నారు. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా ఇప్ప‌టికే రెండు నెలలకు పైగా యార్డును క్లోజ్ చేశారు. అయితే ప్ర‌భుత్వం సడలింపులు ఇవ్వడ‌డంతో.. వారం రోజుల క్రితమే యార్డులో తిరిగి కార్యకలాపాలు స్టార్ట‌య్యాయి.

కూలీలు, కమిషన్ ఏజెంట్లు …రోజు తర్వాత రోజు వచ్చే ప‌ద్ద‌తిలో యార్డులో కార్యకలాపాలు జరుగుతున్నాయి. రెండు రోజులుగా గుంటూరు సిటీలో నమోదైన కేసుల్లో… యార్డు ద‌గ్గ‌ర్లోని మార్కెట్​ వ్యాపారులు ఉండటంతో ముందు జాగ్రత్త చ‌ర్య‌ల్లో భాగంగా యార్డును క్లోజ్ చెయ్యాల‌ని నిర్ణయించారు. మంగళవారం వచ్చిన సరకును మాత్రమే క్రయవిక్రయాలు జరుపుకునేందుకు అధికారులు ప‌ర్మిష‌న్ ఇచ్చారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మిర్చి యార్డు మూతపడనుంది. పరిస్థితులు కుద‌ట‌ప‌డ్డ‌ తర్వాత యార్డు తెరవడంపై నిర్ణయం తీసుకోనున్నారు.