Hanumantrao Praised KCR: కేసీఆర్‌ను ప్రశంసిస్తే తప్పేముంది? మంచి చేశారు అందుకే అభినందించానంటున్న కాంగ్రెస్ లీడర్..

Hanumantrao Praised KCR: సీఎం కేసీఆర్‌ను పొగిడితే తప్పేముంది, మంచి చేశారు అందుకే అభినందించానని చెబుతున్నారు కాంగ్రెస్ లీడర్ హనుమంతరావు. గతంలో బీసీలకు

Hanumantrao Praised KCR: కేసీఆర్‌ను ప్రశంసిస్తే తప్పేముంది? మంచి చేశారు అందుకే అభినందించానంటున్న కాంగ్రెస్ లీడర్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 04, 2021 | 5:07 PM

Hanumantrao Praised KCR: సీఎం కేసీఆర్‌ను పొగిడితే తప్పేముంది, మంచి చేశారు అందుకే అభినందించానని చెబుతున్నారు కాంగ్రెస్ లీడర్ హనుమంతరావు. గతంలో బీసీలకు ఏ ముఖ్యమంత్రి చేయలేనంతగా ఆయన పని చేశారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. రాష్ట్ర జనాభాలో బీసీలే ఎక్కువని, వారి సంక్షేమ భవన్‌లను డిమాండ్ చేసి మరి సాధించుకున్నారని అన్నారు.

బీసీ కులాలన్ని ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సందర్భంగా మీరు టీఆర్ఎస్‌లో చేరుతున్నారా అని అడిగిన ప్రశ్నకు సీఎంను పొగిడినంత మాత్రాన టీఆర్‌ఎస్‌లో చేరుతారని ఎలా అనుకుంటారని తిరిగి ప్రశ్నించారు. తాను ఆ కోవకు చెందినవాడిని కాదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ అన్ని కులాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. అంతేగాకుండా భవన నిర్మాణాలకు రూ.5కోట్లు కేటాయిస్తున్నారని అభినందించారు.