మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్..

పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. మునిసిపల్ ఎన్నికలపై చర్చించేందుకు, దిశానిర్దేశం చేసేందుకు నేడు తెలంగాణ భవన్‌లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు సీఎం. ఈ మీటింగ్‌కు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తు హాజరు కావాల్సి ఉంది. అయితే తెలంగాణ భవన్‌కు సీఎం విచ్చేసిన కొద్దిసేపటి తర్వాత తాపీగా రావడం ప్రారంభించారట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. దీంతో సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారట. సమయపాలన లేకపోతే కష్టమని వార్నింగ్ ఇచ్చారట. […]

మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్..
Follow us

|

Updated on: Jan 09, 2020 | 1:46 PM

పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. మునిసిపల్ ఎన్నికలపై చర్చించేందుకు, దిశానిర్దేశం చేసేందుకు నేడు తెలంగాణ భవన్‌లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు సీఎం. ఈ మీటింగ్‌కు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తు హాజరు కావాల్సి ఉంది. అయితే తెలంగాణ భవన్‌కు సీఎం విచ్చేసిన కొద్దిసేపటి తర్వాత తాపీగా రావడం ప్రారంభించారట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. దీంతో సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారట. సమయపాలన లేకపోతే కష్టమని వార్నింగ్ ఇచ్చారట. కీలకమైన మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయంపై ఇదేనా మీ నిబద్దత అంటూ ప్రశ్నించడమే కాదు, సీఎంకు ఇలానేనా విలువివ్వడం.. అంటూ ఫైరయినట్టు సమాచారం. దీంతో నాలుక కరుచుకున్న నేతలు..మరోసారి ఇలా రీపీట్ కాదంటూ సారీ చెప్పారని తెలుస్తోంది.